కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు

chandrababu-on-kapu

ఏపిలో రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి, తుని లాంటి ఘటనలు ఎక్కడ జరగకూడదు అని పోలీసులు నిత్యం కనురెప్ప మూతపడకుండా చూస్తున్నారు. మంత్రులేమో కేవలం చంద్రబాబు నాయుడు మాట్లాడిందే మాట.. చెప్పిందే వాస్తవం అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ మరోపక్క మాత్రం కాపు వర్గానికి చెందిన వాళ్లు ఒక్కొక్కరుగా తమలోని విభేదాలను పక్కకుబెట్టి చేతులు కలుపుతున్నారు. ముద్రగడ దీక్ష పదో రోజు చేరినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి, ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు నుండి ఒక్కట హామీగానీ, మాటగానీ రాలేదు.

కాపు సామాజిక వర్గానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ.. దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పల్లం రాజులతో పాటు చాలా మంది నాయకులు ఏకమయ్యారు. తమ వర్గానికి న్యాయం ఎలా జరుగుతుంది.? ప్రభుత్వం నుండి తమకు కావాల్సింది ఏమిటి అన్న దానిపై చర్చించారు. గతంలోనే తుని ఘటన జరిగినప్పుడే ముద్రగడ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కాపుల రిజర్వేషన్ల మీద కాలం వెల్లదియ్యాలని చూస్తూ ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేసైనా చేస్తానని. మరి చంద్రబాబు నాయుడు ఇంత జరిగినా కానీ ఎందుకు స్పందించడంలేదు.

చంద్రబాబు నాయుడు కాపుల విషయంలో చేసిన చిన్న చిన్న తప్పులు ఇప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి అన్న మాట వాస్తవం. ఏపిలో కాపు సామాజిక వర్గం జనాభా దాదాపుగా 27శాతం. అందుకే అన్ని పార్టీల నాయకులు వీరి ఓట్ బ్యాంక్ ను టార్గెట్ గా చేశారు. దీన్ని ముందే గమనించి చంద్రబాబు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనబెట్టి పవన్ తో ప్రచారం చేయించారు. కానీ వారిని తర్వాత పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. రెండు సంవత్సరాలకు రెండు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం వంద కోట్లు విడుదల చేసి మమ అనిపించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని కేబినెట్ లో చేర్చుకొని వారి చేత అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుల మీద విమర్శలు చేయించడం చంద్రబాబు చేసిన తప్పే.

మొదటి బాణం: కాపు సామాజిక వర్గానికి ప్రస్తుతం ఒకే ఒక్క నాయకుడు ముద్రగడ పద్మనాభం. గతంలో తుని ఘటనకు ముందు కాపు నాడు నిర్వహించిన కాపు గర్జన కూడా కేవలం ముద్రగడ ఒక్కడి నుండే సాధ్యపడింది. అందుకే ఇప్పుడు తన కేబినెట్ లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రుల చేత ముద్రగడ మీద విమర్శలు చేయిస్తూ విభజించు పాలించు అనే పాలసీని అమలు చేస్తున్నారు.

రెండో బాణం: కాపుల ప్రయోజనాలను కాపాడమే చంద్రబాబు అసలు ఉద్దేశం అయితే ముందే కాపు కార్పోరేషన్ కు ఇస్తానని ప్రకటించిన బడ్జెట్ ను ఇచ్చేవాళ్లు కదా..? కానీ ఎందుకు అలా చెయ్యలేదు. రెండు సంవత్సరాలకు సంవత్సరానికి వెయ్య కోట్ల చొప్పున రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చెయ్యాల్సి ఉండగా అలా చెయ్యలేదు.పైగా ముద్రగడ మీద కావాలని విమర్శలు చేయించడంతో దాసరి, చిరంజీవి, బొత్సలాంటి వాళ్లు ఏకమయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం వీరందరి ఎంట్రీని ఊహించక.. ముద్రగడను మాత్రం తప్పిస్తే కాపు సమస్య తీరుతుంది అని అనుకొని ఉండవచ్చు.

మూడో బాణం: అన్నింటికిమించి మంచి ఉపాయం ఒకటి ఆలోచించి ఉండవచ్చు.కేంద్రం ఏపికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇస్తామని.. ఇస్తామని తాత్సారం చేస్తున్నట్లుగానే చంద్రబాబు కూడా అదే ప్లాన్ వేస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏపితో చేస్తున్న, అవలంభిస్తున్న స్ట్రాటజీనే ఫాలో కావాలనే అనుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఎలాగూ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. మరో రెండు సంవత్సరాలు గడిస్తే.. చాలు తర్వాత ఎన్నికలు. అప్పుడు మళ్లీ ఈసారి మాత్రం చేస్తాం కాపులకు అంటూ చంద్రబాబు ఎన్నికల్లో ప్రచారం చేయాలని అనుకుంటున్నారేమో.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s