న్యుస్ ఛానల్సా..? న్యూసెన్స్ ఛానల్సా..?

channels

తెలుగు మీడియా అంటే గతంలో మంచి గౌరవం ఉండేది. బతకలేక బడిపంతులు అన్నట్లు నిజాయితీ ఉన్న వాడే జర్నలిస్ట్, వాడు చేసేది జర్నలిజం అని నమ్మేవాళ్లు. కానీ కాలం మారింది.. కాదు కాదు మనుషులు మారారు. తెలుగులో ఇంటింటికి ఓ టీవీ ఉన్నట్లే..ఒక్కో పార్టీకి, ఒక్కో సంఘానికి, ఒక్కో వర్గానికి, ఒక్కో నేతకు ఛానల్స్ పుట్టుకువచ్చాయి. మూడు నెలలకు ఓ ఛానల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తెలుగు మీడియా ఛానల్స్ ఎంత బాగా న్యూస్ ను ప్రసారం చేస్తున్నాయంటే.. నిజంగా న్యూస్ ను ప్రసారం చేస్తే.. అసలు వీడియా జర్నలిజం తెలియదు అన్నట్లు ప్రేక్షకుల మైండ్ సెట్ ను ఛేంజ్ చేశాయి.

మామూలుగా మీడియా చానల్స్ ఫాలో అయ్యే మూడు ‘సి’ల పార్ములాను అన్నీ ఛానల్స్ గంపగుత్తగా పాటిస్తున్నాయి. మూడు సి లు అంటే- సి అంటే సినిమా. మన వాళ్లకు తెలిసినంత సినిమా పరిజ్ఙానం ఎవరికి తెలియదు. అందుకే నెలకొసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఎవరు అని బ్యాగ్రైండ్ మార్చీ మార్చీ అదే న్యూస్ ను నాలుుగు మాటలు, రెండు హాట్ సీన్లు జోడించి వేస్తున్నారు. ఇక ఇంకో సి అంటే- క్రికెట్. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే దాని మీద గత కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్న పిహెచ్.డి విద్యార్థుల్లాగా పుంఖానుపుంఖాల న్యూస్ జనాల మీద గుప్పిస్తారు. ఇక చివరి సి, అన్నింటి కన్నా ముఖ్యమైన సి- కాంట్రవర్సి. అంటే వివాదం.. ఎక్కడ రచ్చ ఉంటుందో దాని మీదే చర్చ అన్న మాట.

కొత్తగా ఓ సోలార్ కుక్కర్ కనుక్కున్నారు.. దాని వల్ల పేద వాడికి నెలకు 500 రూపాయల ఖర్చు తగ్గుతుంది అని ఓ వార్త ఉంది. అదే టైంలో ఓ టాప్ హీరోయిన్ మరో హీరోతో కలిసి హోటలో లో ఉన్న ఫోటో లేదంటే వీడియో బయటకు వచ్చింది అనుకోండి.. మన తెలుగు మీడియా వాళ్లు దేనికి ప్రాధాన్యతనిస్తారో తెలుసా..? ఖచ్చితంగా హీరోయిన్ న్యూస్ కే. పైగా ఆ హీరోయిన్ హాట్ వీడియోలు ఏమైనా ఉంటే వాటికి మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసి తిప్పిందే తిప్పి.. క్యాసెట్లు అరిగేలాగా చూపిస్తూనే ఉంటారు. మరి జనాలకు పనికివచ్చే న్యూస్ అక్కర్లేదా అంటే అవసరం లేదు.

ఇక టాప్ ఫైన్ ఛానల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఓ ఛానల్ లో మూడనమ్మకం మీద భలే స్లైడ్ లు వేస్తారు.. కానీ అదే చానల్ పేరును మాత్రం కట్టుబాట్లకు తగ్గట్టుగా పెట్టుకుంటారు.. అదే ఛానల్ లో ఉదయం పూట వాళ్లంటున్న మూడనమ్మకాల ప్రోగ్రామ్సే వస్తుంటాయి. ఇక కొన్ని ఛానల్స్ కాస్త నిజాయితీగానే ఉన్నాయి అని అనుకునేలోపు ఎవరికో ఒకరికి గొడుగుపడుతుంటాయి. ఏకపక్షంగా, ఏడు గంటలకు తెర తీసి చిరవకు పోలింగ్ లో ప్రజలు ఇలా అనుకుంటున్నారని.. ప్రజల అభిప్రాయాన్ని కూడా తాము వెల్లబుచ్చుకుంటున్నాయి. మరి కొన్ని ఛానల్స్ అయితే మీడయా మాటున కోట్ల రూపాయలు దండుకున్నాయి… తమ అక్రమ సంపాదనకు రక్షణగా మీడియాను వాడుకుంటున్నాయి.

మా తాతలు నేతలు తాగారు.. కావాలంటే మా మూతులు చూడండి అన్నట్లు తెలుగు మీడియా ఛానల్స్ ప్రవర్తిస్తునన్నాయి. మా ఛానల్ లో ఎక్స్ క్లూజివ్ అంటారు. తీరా చూస్తే పక్క ఛానల్ వాడు కూడా ఎక్స్ క్లూజివ్ తో పాటు ఫస్ట్ ఆన్ అని వేసుకుుంటాడు. మరి దేన్ని నమ్మాలి. ఓ ఛానల్ లో ఓ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు అని వార్త వస్తుంది… ఛానల్ మారిస్తే పక్క ఛానల్ లో మాత్రం ఐదు గురు చనిపోయారు అని వస్తుంది. తీరా చూస్తే అలా ఎలా అంటే ముగ్గురు చనిపోయారు.. మరో ఇద్దరి పరిస్థితి ఎలాగూ విషయంగానే ఉంది కదా.. చనిపోయిన తర్వాత అన్ని ఛానల్స్ వేస్తాయి.. చనిపోక ముందే మనం వేస్తే మన ఛానల్ టిఆర్ఫి రేటింగ్ పెరుగుతుందని గర్వంగా చెప్పుకుంటారు.

ఎమోషన్స్ తో పని లేకుండా టిఆర్పి మీదే పడి.. జనం బాగొగులను ఎప్పుడో పక్కన పెట్టాయి మన తెలుగు ఛానల్స్. కులానికి ఓ చానల్, ప్రాంతానికో ఛానల్, పార్టీకో చానల్, పలుకుబడి ఉంటే చాలు మరో ఛానల్ ఇలా ఇష్టారాజ్యంగా ఛానల్స్ పేరుకుపోయి.. జర్నలిజానికి విలువలేకుండా పోయింది. తాజాగా ఓ వార్త నన్ను ఈ ఆర్టికల్ రాయడానికి ఉసిగొల్పింది. మధుప్రియ అనే సింగర్ గతంలో ప్రేమ పెళ్లి చేసుకొని.. తాజాగా విడిపోయేందుకు సిద్దమైంది. అయితే దీని మన టీవీ ఛానల్స్   అత్యతుత్సాహం ముందు ఎవరూ పనికి రారు.

ఓ ఛానల్ లో మధుప్రియ మా ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. పలానా అది చెప్పింది. మా ఛానల్ వద్ద విజువల్స్ ఉన్నాయంటూ.. మధుప్రియ, శ్రీకాంత్ లు విడిపోతే  దేశానికి తీవ్ర నష్టం వస్తుంది… రేపటి  నుండి అందరి పరిస్థితి దారుణంగా మారుతుంది అన్నంత బిల్డప్ క్రియేట్ చేశాయి. తమ న్యూస్ స్టూడియోలకు పిలిచి.. ఇంటి గొడవను… జనం గొడవగా మలిచాయి. తాజాగా ఓ ఛానల్ యాంకర్, మధుప్రియ, శ్రీకాంత్ ను తమ స్టూడియోకు పిలిచి లైవ్ ప్రోగ్రామ్ చేసింది. అయితే అందులో రకరకాల ప్రశ్నలు వేసి.. చివరకు మధుప్రియ ఎదుర్కొంటున్న పరిస్థితి మీద ఓ పాట పాడాలని యాంకరమ్మ అడిగింది. పాపం తమ బాధ చెప్పుకొవడానికి వస్తే.. ఇలా అడగడం ఎంత వరకు కరెక్ట్.

జర్నలిజం అంటే జనాలకు పనికి వచ్చే న్యూస్ ను అందించడం కాదు అని తెలుగు మీడియా ఛానల్స్ బల్లగుద్ది మరీ నిరూపిస్తున్నాయి. జనాలను పట్టించుకోకుండా కేవలం టిఆర్పి రేటింగ్ కోసం మాత్రమే పనిచెయ్యడం.. జర్నలిజానికి అసలు అర్థం అంటున్నాయి. మన తెలుగు ఛానల్స్ లో న్యూస్ ఛానల్స్ కు, ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ కు ఎలాంటి తేడా లేదు అనిపిస్తోంది. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ లో కూడా ఎంతో ఎంటర్ టైన్ మెంట్ ఉంది కదా. అయ్యా… మీరు న్యూస్ ఛానల్ నడుపుతున్నారా..? లేదా న్యుసెన్స్ ఛానల్ నడుపుతున్నారా…? అంటే మాత్రం వచ్చే సమాదానం ఏంటో తెలుసా…? న్యూస్ ఛానల్ అని పేరు పెట్టుకున్నా కానీ న్యూసెన్స్ అవుతోంది.. అయినా కూడా అందులో న్యూ(కొత్త) ఉంది కదా మరి అంటారేమో.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s