జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు…?

YS-Jagan-Assets-attached

Image source: full updates

వైయస్ జగన్ కూడబెట్టిన ఆస్తులు అన్నీ అక్రమమే అని ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ముందు నుండి కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సాక్షి మీడియాతో సహా అతడి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుంటుందని కూడా గతంలో ప్రకటన చేశారు. అయితే తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరవ సారి జగన్ కు చెందిన 749 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. లోటస్ పాండ్ తో సహా, బెంగళూరులోని ప్యాలెస్ ను కూడా ఈడీ అటాచ్ చేసింది. మాటలు కోటలు దాటినా కాళ్లు మాత్రం గడప దాటడం లేదన్నట్లు గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు ఆస్తులను ప్రభుత్వపరంగా చెయ్యడానికి ఇది సరైన టైం కానీ.. బాబు గారు మాత్రం దానికి ముందుకు రావడం లేదు.

జగన్ ఆస్తులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడూ వార్తలు రాసే సాక్షి మీడియాను టార్గెట్ చేశారు. అందుకే ఖచ్చితంగా సాక్షి మీడియాను ప్రభుత్వపరం చేస్తామని… అది ప్రజల ఆస్తి అని ముందు నుండి కూడా చంద్రబాబు అంటున్నారు. మరి ఇప్పుడు ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు జగన్ కు చెందిన అన్ని ఆస్తులను ప్రభుత్వపరం చేసుకోవచ్చు కదా అని వాదన వినిపిస్తోంది. కేంద్రంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బిజెపి పార్టీనే. పైగా మోదీ, చంద్రబాబు మంచి స్నేహితులు అనే వార్త కూడా ఉంది. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఈ దిశగా ఎందుకు అడుగులు వెయ్యలేకపోతున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చసాగుతోంది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పటికే జగన్ ముచ్చెమటలు పట్టిస్తున్నారని, ఇప్పుడు జగన్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేస్తే ఖచ్చితంగా విపరీత పరిణామాలు తప్పవని బాబు సన్నిహితులు హెచ్చరిస్తున్నారట. అందుకే బాబు దీనిపై కాస్త వెనక్కి తగ్గినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పైగా కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ అనుకున్న రీతిలో సహకరించడం లేదని…. అనవసరంగా ప్రయత్నించి ఎందుకు పేరు పోగొట్టుకోవాలని కూడా బాబు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు దూరమైన ఓ వర్గం జగన్ కు అనుకూలంగా మారిందని… ఈ టైంలో జగన్ ను టచ్ చేస్తే ఆ సామాజిక వర్గం ఆగ్రహం ఎదుర్కోవలసి వస్తుందని కూడా చంద్రబాబు అడుగు ముందుకు వెయ్యడం లేదని తెలుస్తోంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s