ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?

Zakir-aప్రపంచంలోని ఏ మతం మనుషులను చంపమని చెప్పదు. వీలైనంత వరకు హింసకు దూరంగా ఉండాలనే చెబుతుంది. కానీ కొంత మంది మాత్రం మతాన్ని అడ్డుగా పెట్టుకొని.. మారణహోమానికి దారులు వేస్తుంటారు. అలాంటి వాళ్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో యువతను రెచ్చగొట్టి.. ఆవేశంలో తాము అనుకున్నది సాధించాలనే తపన ఉంటుంది. తాజాగా ఓ మతగురువు మీద వస్తున్న ఆరోపణలపై ఇటు భారత్, అటు బంగ్లాదేశ్ లో చర్చిస్తున్నాయి. భారత్ కు చెందిన జకీర్ నయక్ అనే వ్యక్తిని విచారించాలని భారత్ ను బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ జకీర్ నయక్ ఎవరు..? ఉగ్రవాదులకు ఈయన ఏంటి సంబందం..?

తాజాగా బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదుల వల్ల జకీర్ నయక్ అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది.ఢాకా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన రోహన్‌ ఇంతియాజ్‌.. ముంబైకు చెందిన ఇస్లామిక్‌ రీసెర్చి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జకీర్‌ నాయక్‌ ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొందినట్లు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నాడు. దీంతో ఎన్ఐఏ అధికారులు జకీర్ నాయక్‌కు సంబంధిన ప్రసంగాల వీడియోలన్నింటిని పరిశీలిస్తున్నారు. మరో ఉగ్రవాది నిబ్రస్‌ ఇస్లాం.. బెంగళూరుకు చెందిన మెహదీ మస్రూర్‌ బిస్వాస్‌ ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అయినట్లు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. అలా ఉగ్రవాదులకు జకీర్ పరోక్షంగా గురువుగా మారారు.

బంగ్లాదేశ్ దీనిపై వెంటనే స్పందించింది. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన జకీర్ పై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఆయన గురించి ఆసక్తికర వివరాలు ఇప్పుడిప్పుడే మీడియాలో వస్తున్నాయి. ముంబైకి చెందిన జకీర్ నాయక్ ఓ డాక్టర్. అయితే యావత్ భారతావనికి గత 20 ఏళ్లుగా ఆయన ఓ మత బోధకుడిగా సుపరిచితం. 1991లో ముంబైలో ఇస్లామిక్ రీసెర్చీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆ తర్వాత 2006లో పీస్‌ టీవీ అనే ఇంగ్లిష్‌ చానల్‌ను ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది వీక్షించే ఇస్లామిక్‌ చానల్‌ ఇదే. ఆ తర్వాత పీస్‌ టీవీ ఉర్దూ, పీస్‌ టీవీ బంగ్లా, పీస్‌ టీవీ చైనీస్‌ చానళ్లను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరుగుతూ జకీర్‌ నాయక్ మత బోధనలు చేస్తుంటారు.

ఇక భారత్ కు బద్ద శత్రువైన పాకిస్థాన్ లో జకీర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ప్రసంగాలకు వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పర్యటనకు అక్కడ విశేషమైన ఆదరణ లభిస్తుంది. తాజాగా ఢాకా ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన జకీర్ కు చెందిన ఎన్నో రెచ్చగొట్టే ప్రసంగాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఎక్కువ మంది ఆడవాళ్లను ఎందుకు మతం అనుమతిస్తుంది అనే ప్రశ్నకు.. ఆయన సమాధానం ‘‘ అల్లా ఆడవాళ్లను అలా పుట్టించాడు. అయినా ప్రపంచంలో ఎక్కువగా ఉన్న మహిళల బాధ్యతలను ఎవరు తీసుకుంటారు. అందుకే ఎక్కువ మంది ఆడవాళ్లను పెళ్లి చేసుకోవడంతో ఎలాంటి తప్పు లేదు’’ అని సమాధానమిచ్చాడు.

తాజాగా ఆయనకు చెందిన పీస్ టీవీపై ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. పీస్ టీవీకి ఇండియాలో ఎలాంటి లైసెన్సులూ మంజూరు చేయలేదు. దుబాయ్ నుంచి అప్ లింక్ అవుతున్న ఈ చానల్ భారత ఉపఖండంలో కేబుల్ ఆపరేటర్ల ద్వారా సులువుగానే ప్రసారం అవుతోంది. భారత సమాచార శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ చానల్ ప్రసారాలు సాగుతున్నాయని అధికారులు కనుగొన్నారు. దీంతో భారత్‌లో పీస్ ఛానెల్‌కు చెక్ పెట్టే పనిలో పడ్డారు. నాయక్ చేసిన ప్రసంగాలన్నింటినీ పరిశీలించాలని, వాటిల్లో అభ్యంతర మాటలుంటే కేసులు పెట్టాలని నిర్ణయించారు. లైసెన్సులు లేని చానళ్లను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

‘ముస్లింలు అందరూ ఉగ్రవాదులుగా మారాలి’ లాంటి వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తుంటారు. గతంలో కరుడుగట్టిన ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌కు మద్దతుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్‌ను ఉగ్రవాది అంటే అంత ఎత్తున లేచే జకీర్ ఇస్లాం వ్యతిరేకులపై పోరాడే నాయకుడిగా అభివర్ణించడం విశేషం. అంతేకాదు 9/11 అమెరికా ట్విన్‌ టవర్ల దాడికి కారణం జార్జి బుష్‌ అని ఆరోపించారు.అలా ముస్లిం వర్గానికి చెందిన వాళ్లనున రెచ్చగొట్టడం జకీర్ కు వెన్నతో పెట్టిన విద్య. తాజా పరిణామాలతో జకీర్ కు కష్టకాలం మొదలైంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s