పాకిస్థాన్నే కాదు.. ప్రపంచాన్ని ఎదురిస్తాం

1

రూపాయి… రూపాయి..ఏం చేస్తావ్ అంటే.. అన్నాదమ్ముల మధ్య తగువులు పెట్టగలను, ఆలుమగల మధ్య చిచ్చు పెట్టగలను, తండ్రికొడుకుల మధ్య కలతలు తీసుకురాగలను అన్నదంట. కానీ వాడితే అదే రూపాయి అద్భుతాలు కూడా చెయ్యగలదు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అలాంటి అద్భుతానికి అంకురార్పణ చేశారు. కేవలం ఒకే ఒక్క రూపాయితో భారత రక్షణరంగ ముఖచిత్రాన్ని మార్చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. యుద్ధం అనేది ముందుగా మనిషి మెదడులో పుడుతుంది అన్నది వాస్తవం. కానీ ఇప్పుడు యుద్ధం కన్నా రక్షణ తప్పని సరి.

భారత్ చుట్టూ పాకిస్థాన్ అనే గుంటనక్క కాచుకూర్చుంది. నేరుగా తలపడే దమ్ముదైర్ఘ్యంలేని, ఆ టక్కరి దొంగ దెబ్బ తీస్తోంది. జమ్ము కాశ్మీర్ లో గత కొన్ని దశాబ్దాలుగా ఆగని హింసకు ఆజ్యం పోస్తోంది. అలాంటి పాకిస్థాన్ కు, భారత్ మీద రంకెలు వేస్తున్న చైనాలాంటి మదమెక్కిన దేశాలకు మోదీ సర్కార్ గట్టి, చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నది. యుద్ధంలో మేము పాలుపంచుకోవడం లేదే అనే బాధను దూరం చేస్తూ ప్రతి భారతీయుడు ఓ సైనికుడుగా మారే సదవకాశాన్ని కల్పిస్తోంది మోదీ సర్కార్. ఇందుకు వేసిన అతి పెద్ద ప్లాన్ ఒక్క రూపాయి.

అవును.. ఒకే ఒక్క రూపాయితో భారత రక్షణ వ్యవస్థ శత్రుదుర్భేద్యంగా మారుతుంది. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారత్ ఎదిగేందుకు మన జేబులో ఉన్న ఒకే ఒక్క రూపాయి అవసరం. ఒక్క రూపాయితో భారత్ ను కొద్ది కాలంలోనే సూపర్ పవర్ గా మార్చేందుకు మంచి అవకాశం కలుగుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి రోజు ఒక రూపాయిని భారత సైన్యం కోసం జమ చేస్తే చాలు.. అదే ఇంతింతై వటుడింతై అన్నట్లు మారుతుంది.

ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక బలం భారత్ సొంతం. అలాంటి భారత్ కు మరింత బలం చేకూరాలని .. సందుకోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్, చైనాలాంటి దేశాలకు బుద్ధిచెప్పాలంటే మన బలం మరింత పెరగాలి. ఇప్పటికే రక్షణ రంగంలో మనం ఎంతో అభివృద్ధి చెందినా.. ఇంకో అడుగు ముందుకు వెయ్యాల్సిన అవసరం ఉంది. అందుకే అమెరికాను మించిన, రష్యాను తలదన్నే, చైనాకు చెమటలు పట్టించేందుకు మన జేబులోని ఒక్క రూపాయి కావాలి.

ఏంటి ఒక్క రూపాయి ప్లాన్..?
ప్రతి ఒక్క భారతీయుడు రోజుకు ఒక్క రూపాయి చొప్పున భారత ఆర్మీకి జమ చేస్తే చాలు… అదే మనకు సూపర్ పవర్ ను అందిస్తుంది.

అసలు రూపాయితో ఏం జరుగుతుంది..?
మనం వేసే ఒక రూపాయితో నిజంగా అద్భుతాలే జరుగుతాయి. మనం వేసే ఒకే ఒక్క రూపాయితో 400 ఫైటర్ జెట్స్, అదే ఒక్క రూపాయితో 1100యుద్ద హెలికాప్టర్లు, ఒక్క రూపాయితో 2500 యుద్ధట్యాంకులు, జేబులోని ఆ ఒక్క రూపాయితో 900 బ్రహ్మోస్ మిస్సైల్స్ కొనుగోలు చెయ్యవచ్చు. SU సుఖోయ్ ధర 350 కోట్లు.. మనం వేసే ఒక్క రూపాయితో అలాంటి SU సుఖోయ్ లను 400 కొనుగోలు చెయ్యవచ్చు. లైట్ కాంబాట్ హెలికాప్టర్ ధర 135 కోట్లు మన జేబులోని ఆ రూపాయితో అలాంటి 1100 హెలికాప్టర్లు సాదించవచ్చు. యుద్ధ విమానం 60 కోట్లు అలాంటి యుద్ధ విమానాలను మన రూపాయితో 2500 పొందవచ్చు. అర్జున్ ట్యాంక్ ధర 55 కోట్లు అదే రూపాయితో 2800 అర్జున ట్యాంకులను సమకూర్చుకోవచ్చు. బ్రహ్మోస్ మిస్సైల్ 18 కోట్లు అలాంటి వాటిని మన రూపాయితో 9000 బ్రహ్మోస్ లను భారత్ ఆర్మీకి అందించవచ్చు. ఇదంతా కేవలం మనం వేసే ఒకే ఒక్క రూపాయితో సాధ్యమవుతుంది.

ప్రతి ఒక్క భారతీయుడు ఈ దేశం నాది.. ఈ దేశానికి బాధ్యతగా ఒక్క రూపాయిని ప్రతి రోజు వేస్తాను అని అనుకుంటే మాత్రం కేవలం ఒక్క రోజులో 130 కోట్లు జమ అవుతాయి. రోజుకు 130 కోట్ల చొప్పున నెలకు 3900 కోట్లు. అదే రూపాయిలు కలిసి ఏడాదికి 46, 800కోట్లు జమ అవుతుంది. పాకిస్థాన్ వార్షిక బడ్జెట్ రక్షణ రంగానికి 47వేల కోట్ల రూపాయలు. మన ఒక్క రూపాయే పాకిస్థాన్ వార్షిక రక్షణ బడ్జెట్ కు సమానం. మరి మనం తలుచుకుంటే మన ఒక్క రూపాయితో మన రూపురేఖలను మార్చుకోగలం.

ఎలా చెయ్యాలి..?
భారత ఆర్మీకి చెందిన అకౌంట్ లో మనం డబ్బులు వేస్తే చాలు.. అందులోని ప్రతి రూపాయిని కేవలం ఆర్మీ అవసరాలకు మాత్రమే వాడుకుంటుంది ప్రభుత్వం. మీరు కూడా ఆర్మీకి చేదోడుగా నిలవాలని అనుకుంటే అకౌంట్ వివరాలు..
అకౌంట్ నెంబర్ : 90552010165915
ఆర్మీ వెల్ఫేర్ అండ్ బ్యాటిల్ క్యాజువాలిటీ
IFSC Code: SYNB0009055
సిండికేట్ బ్యాంక్
సౌత్ బ్లాక్, కొత్త దిల్లీ 110011

మోదీ సర్కార్ తీసుకుంటున్న ఈ చర్యలతో పాకిస్థాన్ పక్కతడుపుకుంటోంది. చైనాకు నిలువునా చమటలు పడుతున్నాయి. భారతీయులు ఆర్మీకి ఇచ్చే ఆ ఒక్క రూపాయి వేరే దేశాలకు ఎంత ముప్పో అందరికి తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఉంది. మనం కేవలం మన రక్షణ కోసం మాత్రమే ఇలా చేస్తున్నాము తప్పితే వేరే దేశాల మీద యుద్ధానికి రంగం సిద్ధం చెయ్యమని కాదు. ప్రపంచాన్ని శాసించే సత్తా ఉన్న భారత్.. ఆ ఒక్క రూపాయితో మరింత బలోపేతం కావాలని మనసారా కోరుకుంటున్నా..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s