Modi perfect answer with surgical stike

నరేంద్ర మోదీ.. ఓ మగాడు, మొగుడు

భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అడుగు వేశాడు. భారత రక్షణ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించే ఓ అధ్యాయానికి అంకురార్పణ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు తమ డైరీల్లో రక్తాక్షరాలను లిఖించుకునేలా భారత ఆర్మీని ఎంతో నేర్పుగా వాడారు మోదీ. యుపిఎ సర్కార్ కంటే ఎన్డీయే సర్కార్ ఉంటే ఖచ్చితంగా దేశరక్షణ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు అనే నమ్మకానికి మరోసారి నిదర్శనాన్ని చూపారు. మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్ కు ప్రేమ లేఖలు కాదు.. బుల్లెట్లు పంపుతారు అని ఎంతొ మంది నమ్మిన నమ్మకాన్ని రుజువు చేశారు.

పాకిస్థాన్ ఆక్రమిక కాశ్మీర్ లోకి భారత్ ఆర్మీ చొచ్చుకువెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్ అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. మోదీ సహనాన్ని అలసత్వంగా తీసుకున్న పాకిస్థాన్ పదేపదే తన ఉగ్రపంజా విసిరింది. భారత ఆర్మీ బలం ఏంటో.. మోదీ స్ట్రాటజీ ఏంటో కేవలం ఒకే ఒక్క దాడితో నిరూపించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియ్యడమే కాకుండా.. భారత ఆర్మీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు మోదీ.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ ఏం చెయ్యలేకపోతున్నారు.. నాడు చూపించిన 56 ఇంచుల ఛాతి ఎక్కడికి పోయింది అన్న విమర్శకులకు ఒకే ఒక్క ఘటనతో నిరూపించారు. ఆలస్యంగా అయినా కాస్త ఆలోచనతో వేసిన మోదీ అడుగు పాకిస్థాన్ ఉగ్రవాదులకు, అక్కడి సేనలకు ప్యాంటు తడిసేలా చేసింది. మన ఆర్మీ బేస్ మీద దొంగచాటుగా పాక్ ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా.. వారి భూభాగంలోనే 39 ఉగ్రవాదులను హతమార్చి.. మోదీ దైర్యం ఏంటో నిరూపించారు.

లాల్ బహదూర్, వాజ్ పేయి చెయ్యలేనిది మోదీ చేసి..
చరిత్రలో పాకిస్థాన్ మీద ఇలాంటి దాడులకు పాల్పడిన మొదటి ఘటన కూడా ఇదే. నాడు లాల్ బహదూర్ శాస్త్రి దగ్గరి నుండి వాజ్ పేయ్ వరకు మన ప్రధానులు పాకిస్థాన్ కు శాంతి కపోతాన్ని పంపితే వాళ్లు మాత్రం దాన్ని చంపేస్తున్నారు. పార్లమెంట్ మీద దాడి ఘటన తర్వాత కూడా వాజ్ పేయి గట్టిగా పాకిస్థాన్ కు బదులివ్వలేదు అని ఇప్పటికీ విమర్శ. కానీ లాల్ బహదూర్ శాస్త్రి, మోదీ చెయ్యలేని సహసాన్ని మోదీ చేసి.. పాకిస్థాన్ కు ధీటైన సమాధానమిచ్చారు.

మగాడు అంటే ఎలా ఉంటాడో నిరూపించాడు మోదీ. పాకిస్థాన్ ముష్కర సేన మన ఆర్మీ క్యాంపుల మీద దాడి చేస్తే.. పాకిస్థాన్ ప్రధాని కడుపు మండిన కాశ్మీరీలు ఇలా చేసి ఉంటారు అని చతురత ప్రదర్శించారు. మన మోదీ మాత్రం తన దైర్యాన్ని చూపించారు. పాకిస్థాన్ కలలో కూడా ఊహించని విధంగా వారి భూభాగంలోనే పాకిస్థాన్ ఉగ్రవాదులను హతమార్చేసింది మన ఆర్మీ.

ఉరీ ఘటన తర్వాత పాకిస్థాన్ భారత్ మీద కాదు.. పేదరికం మీద పోరాటం చెయ్యాలి అన్న ప్రకటన చాలా మందిలో నిరుత్సాహం నింపింది. ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దాడి చేస్తే తాట తీస్తాం అన్న మోదీ ఇలా మాట్లాడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అలా అని తన రాజనీతిని నిరూపించాడు. ముందుగా పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజంలో తలదించుకునేలా చేసి.. సార్క్ సమావేశాల్లో ఏకాకిని చేసి.. అప్పుడు దెబ్బ తీశాడు. పాకిస్థాన్ కు సరైన మొగుడు నరేంద్ర మోదీనే అనేలా చేశాడు.

పాకిస్థాన్ నుండి ఇప్పటి దాకా ఎన్నో సార్లు దాడులు జరిగాయి. మన వాళ్లు ఎంతో మంది చనిపోయారు. పాకిస్థాన్ కు ఎన్నో సార్లు మన వాళ్లు హెచ్చరికలు జారీ చేశారు. కానీ కుక్క బుద్దిలాగా తన వైఖరి మార్చుకోలేదు. అందుకే మోదీ ఒకే ఒక్క దాడి చేయించారు. అంతే నిన్నటి దాకా ఉన్న చరిత్ర మొత్తం తుడుచుకుపోయింది. పాకిస్థాన్ కు భారత్ ఇలా కూడా చెయ్యగలదు అని నిరూపించాడు. పాకిస్థాన్ లోకి దూరి చంపే సీన్లు కేవలం సినిమాల్లో మాత్రం చూపించడం జరుగుతుంది.. కానీ రియల్ లైఫ్ లో అది చేతకాదు అన్న వారికి సర్జికల్ స్ట్రైక్ ఒక గుణపాఠం అవుతుంది. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన మోదీ నిజంగా పాకిస్థాన్ కు తగ్గ మగాడు, మొగుడు

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s