నాడు కలాం వెనక రాజకీయం.. నేడు కోవింద్ ముందు రాజకీయం

narendra-modi-abdul-kalam

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు పాలిటిక్స్ నందు ఎలక్షన్ పాలిటిక్స్ వేరయా అని కూడా అనొచ్చు. ఎందుకంటే నాడు ఎన్టీయే అభ్యర్థి విషయంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ చూపిన రాజకీయ నీతి ముందు అందరూ బలాదూర్ అయ్యారు. నాడు జరిగిన కొన్ని ఘటనల వల్ల వాజ్ పేయి ప్రభుత్వానికి మైనార్టీలు దూరమవుతున్నారు అనే భావన కలిగింది. అలాంటి సమయంలో అబ్దుల్ కలాంలాంటి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి అందరి దృష్టిని మరల్చారు. అందరూ అబ్దుల్ కలాం అయితే బెస్ట్ అని అనేలా చేశారు. అయితే నాడు వాజ్ పేయి చూపిన నీతినే దళిత కార్డుతో మోదీ కూడా చేస్తున్నారు. కాకపోతే వాజ్ పేయికి రాజకీయ ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యం. మోదీకి మాత్రం తన పరపతి ముందు ఏదీ ముఖ్యం కాదు.

దళిత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా దేశంలో చాలా చోట్ల ఉన్న దళిత వ్యతిరేకాగ్నిని చల్లార్చేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఆర్ఎస్ఎస్ మూలలున్నాయా? అని వెతుకుతోంది కానీ మోదీ ప్లాన్ ఏంటో కనిపెట్టలేకపోతోంది. ఉత్తర్ ప్రదేశ్ సహా చాలా చోట్ల దళిత వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో మోదీ అండ్ కో వేసిన అద్భుతమైన ప్లాన్ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక.

నాడు అబ్దుల్ కలాం పేరును ప్రకటించడానికి ముందు వాజ్ పేయి ప్రధానిగా ఉన్న కాలంలో జరిగిన గోద్రా అల్లర్లు, పశ్చిమ బెంగాల్ ఘటనల కారణంగా మైనార్టీలకు ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లింది అయితే అదే సమయంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ను ఎంపిక చేయడం ద్వారా దాన్ని తగ్గించుకోగలిగారు. అయితే ఇదంతా కలాం వెనక జరిగిన వ్యవహారం. కానీ నేడు మోదీ మాత్రం కోవింద్ ముందు రాజకీయం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు, బి.జె.పి అనుకూల వ్యక్తిని తెర మీదకు తీసుకురాగలిగారు. అయితే రాజకీయ చదరంగంలో ఎన్ని ఆయుధాయులు వీలైతే అన్నింటిని వాడే మోదీ ఈసారి కూడా అలాంటి బలమైన ‘దళిత’ కార్డునే వాడుకున్నారు. పాపం లోగుట్టు ఎరుగని కాంగ్రెస్, యుపిఎ మిత్రపక్షాలు ఎంతసేపూ ఆ కోవింద్ కు వ్యతిరేకంగా అభ్యర్థిని బలపరుస్తున్నారే కానీ దళిత కార్డు ఎందుకు వాడారు.? దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిపెట్టలేకపోతున్నారు. కులం కులం కాకుంలం కావాలి అందరికీ ఓ కులం.. అన్నట్లు చివరకు మన కుల పిచ్చి అధ్యక్ష ఎన్నికల వరకు పాకడం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలు అదృష్టం, అదే సమయంలో దురదృష్టం

Leave a comment