జీఎస్టీ అంటే అదేదో బ్రహ్మాండం కాదు

2

జీఎస్టీ – ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. నిన్నటి దాకా ఉన్న అన్ని రకాల పన్నులను రద్దు చేస్తూ పన్ను విధానంలో మోదీ సర్కార్ తీసుకు వస్తున్న అతి పెద్ద పన్ను సంస్కరణ. అయితే మోదీ ఇష్టారాజ్యంగా చేసుకుంటూపోతున్నారని కొంత మంది, లేదు లేదు ఆయన ఏం చేసినా దేశ హితం కోసం అంటూ మరికొందరు వాదులాడుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా సామాన్య జనాలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు జీఎస్టీ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు.. చదువుకున్న వారికి కూడా దానిపై అవగాహన లేదు. జులై 1 నుండి జీఎస్టీ అమలవుతోందని.. ఖచ్చితంగా జీఎస్టీ కింద నమోదు చేసుకోవాలని మీడియా తెగ భయపెడుతోంది. అయితే మోదీ సర్కార్ జీఎస్టీ అంటే ఏమిటో వివరించడం.. దాన్ని ఎలా కట్టాలి.. ఎవరు కట్టాలి? అనే అతి సాధరణ ప్రశ్నలను కూడా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించలేకపోతోంది.

ఓ మిత్రుడికి చిన్నపాటి వ్యాపారం ఉంది. అయితే ఏడాదికి 20లక్షలు మించిన వ్యాపారం చేస్తే జీఎస్టీ కింద పన్ను కట్టాలి. కానీ దాని గురించి సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది మార్కెట్ లో బ్రోకర్లను పట్టుకుంటున్నారు. అలాగే ఆ మిత్రుడు కూడా మార్కెట్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ కు ఎంత అవుతుంది అని కనుక్కుంటే.. ఏకంగా 3వేల రూపాయలు డిమాండ్ చేశారట. ఇది నిజంగా సిగ్గు చేటు. ప్రభుత్వం చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడంతో ఇలాంటి వాటికి అవకాశం కలుగుతోంది. అయితే ఆన్ లైన్ లో మాత్రం దీనికి ఎలాంటి డబ్బులు అవసరం లేదు.. కేవలం అవగాహన ఉంటే చాలు. కొంత మంది మాత్రం ఆన్ లైన్ లో దీని గురించి మొత్తం తెలుసుకొని ఆ తర్వాత కడుతున్నారు.

ఇక జీఎస్టీ అంటే ఏమిటో ఒక్క లైన్ లో చెప్పాలి దేశం మొత్తం ఒకే పన్ను. ఉదాహరణకు గుజరాత్ లో ఓ కుర్చీ ధర 1000 రూపాయలు అయితే దానిపై ఆ రాష్ట్రంలో ఎంత పన్ను వేస్తారో తమిళనాడులో కూడా అంతే పన్ను వేస్తారు. కానీ గతంలో అలా కాకుండా ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పన్ను ఉండేది. దీని వల్ల దేశంలో అమలవుతున్న అన్ని పన్నులు రద్దవుతాయి. చివరకు ఒకే పన్ను అమలులోకి వస్తుంది అదే జీఎస్టీ.

ఇక జీఎస్టీ కింద వ్యక్తులు లేదా కంపెనీలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
https://www.gst.gov.in/ కు వెళ్లండి. అక్కడ ట్యాక్స్ పేయర్స్ (Tax Payers)అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ వివరాలు అడుగుతుంది. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ పరిశీలనకు వెళుతుంది. అంతా ఓకే అనుకుంటే అప్పుడు మీకు ఓ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎలాగైతే TIN ఉండేదో బహుశా అలాంటిదే.

సాధారణ వ్యక్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద కంపెనీల ఓనర్ల వరకు జీఎస్టీ ఏంటో.? దాని తీరు తెన్నులు ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే మొత్తం జీఎస్టీ అంటే ఏమిటో చెప్పకున్నా.. జీఎస్టీ వల్ల ఏం తగ్గుతాయో? ఏం పెరుగుతాయో ? మాత్రం చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను.

తగ్గేవి- టీ పౌడర్, కాఫీ పౌడర్, చక్కెర, నెయ్యి, వెన్న, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ , సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, ఫర్నీచర్, పిజ్జా, బర్గర్స్, చెప్పులు, బూట్లు, రెడీమేడ్ దుస్తులు, మామూలు దుస్తులు, బైక్స్, కార్లు, వైద్య పరికరాలు, సిమెంట్

పెరిగేవి – బ్రాండెడ్ రైస్, మొబైల్స్, కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు, ఆయుర్దేద మందులు, బ్రాండెడ్ నూడుల్స్, కూల్ డ్రింక్స్, టీవీలు, వాషింగ్ మెషీన్లు, మైక్రో ఓవెన్లు, జువెలరీ, సిగరెట్లు, పాన్ మసాలా

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s