/need-to-give-reservations-for-poor-people

రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి… కేసీఆర్ సర్కార్‌కు సూచన

కేసీఆర్ మ‌రోసారి తేనెతుట్టును క‌దిపారా.. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తుంది. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంలో ముందుండే కేసీఆర్, రిజ‌ర్వేష‌న్లు వ్య‌వ‌హారంలో కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌నుకుంటున్నారా? కానీ అది కొన్ని వ‌ర్గాల‌కు సంతృప్తినిచ్చినా.. మిగిలిన వ‌ర్గాలను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇప్ప‌టికే రాజ్యాంగం క‌ల్పించిన కోటాలు దాటుతున్నాయి. మైనార్టీల‌కు హామీ ఇచ్చారు. గిరిజ‌నుల‌కు పెంచుతామ‌న్నారు. ఇప్పుడు బీసీల‌కు కూడా దామాషా ప‌ద్ద‌తిలో క‌ట్ట‌బ‌డి ఉన్నామంటున్నారు.

ఈ ా ఆర్టికల్ ఒరిజినల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

why-modi-announce-currency-decision-in-night/

రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?

దేశం మొత్తం షాక్ తిన్న వార్త. ఆఫీసుల నుండి వచ్చిన సగటు ఉద్యోగి తీరిగ్గా వార్తలు చూద్దామని టీవీ పెడితే మోదీ పెద్ద బాంబ్ పేల్చాడు. మొన్న రాత్రి 8 గంటల తర్వాత మోదీ లైవ్ లో మాట్లాడుతూ దేశానికి షాకిచ్చే వార్తను వెల్లడించాడు. అయినా దేశాన్ని కొత్త మలుపు తిప్పిన మోదీ ప్రకటన ఆ రాత్రిపూట ఎందుకు ప్రకటించారు అనే డౌట్ చాలా మందికి వచ్చింది. 500, 1000 నోట్ల రద్దు చేస్తూ మోదీ రాత్రి 8.30కు ప్రకటన చేశారు. ఇలా మోదీ ఆ టైంలోనే ఎందుకు ప్రకటన చేశారంటే..

మొత్తం ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Modi facing problems like mother pain during

‘నవభారత్’ను కనేందుకు భరతమాత సిద్ధం.. పురుటి నొప్పులు మాత్రం ప్రధానికే

దేశం మొత్తం బాధను అనుభవిస్తోంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం దేశంలో చాలా మందికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నోళ్లకు ఫుల్ గిరాకీ తగిలింది. కొంత మంది అయితే కారుకూతలు కూస్తున్నారు. అయితే ఇక్కడ ఓ సూక్ష్మాన్ని మాత్రం చాలా మంది గుర్తించడంలేదు. మంచి చెయ్యాలి అంటే కొంత ఇబ్బందిపడక తప్పదు అని. మోదీ కూడా గోవా సభలో అదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 30 వరకు అందరికి ఇబ్బందులు తప్పవని, కానీ భావితరాల భవిష్యత్తు కోసం తప్పదు అని అన్నారు.

నిజానికి భారతదేశం పరిస్థితి అచ్చంగా పోల్చాలి అంటే ఓ తల్లి ప్రసవ వేదనతో పోల్చవచ్చు. నవభారతం కోసం మనం ఎదురుచూస్తూనే ఉన్నాం.. కానీ అలాంటి భారతదేశం రావాలి అని అనుకుంటున్నామే కానీ మన కళ్ల ముందు సాక్షాత్కారానికి సిద్దంగా ఉన్న ఆ పరిస్థితిని మాత్రం గుర్తించడంలేదు. నవభారతం ఇప్పుడు పొత్తిళ్లలో ఉంది. కానీ ప్రసవ వేదన మాత్రం కేవలం ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కలుగుతోంది. అవును చరిత్ర కూడా ఇదే చెబుతోంది. నవభారతం కోసం తీసుకున్న ప్రతీసారి ప్రధానులు అనేక ఇబ్బందులు, అవమానాలుపడ్డారు.

నాడు భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఇందిరాగాంధీ నుండి నేటి నరేంద్ర మోదీ వరకు అవే అవమానాలు. అవే అనుమానాలు. కానీ నాయకుడు దేశానికి ప్రధాని అయితే ఇలాంటి వాటికి భయపడి వెనకడుగువేయడు. నాడు బ్యాంకులను జాతీయం చేసినప్పుడు కూడా ఇందిరా గాంధీ అనేక విమర్శలను ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీకి పిచ్చిపట్టింది.. అసలు ఆమె ఏం చేస్తుందో కూడా అర్థంకాని పరిస్థితిలో ఉంది అని చాలా మంది అన్నారు. కానీ నిజానికి నేడు మనం బ్యాంకింగ్ లో ఇన్ని సేవలు అందుకుంటున్నాం.. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉంది అంటే అది ఇందిరాగాంధీ చలవే. నాడు అవమానాలకు ఆమె భయపడి వెనక్కి తగ్గి ఉంటే నేడు మనం ఈ ప్రగతిని చూసి ఉండేవాళ్లం కాదు.

అంతంత మాత్రం మెజార్టీతో ప్రభుత్వాన్ని గుడ్డిలో మెల్లలా నడిపించిన నాటి మరో ప్రధాని పి.వి. నరసింహారావు తీసుకున్న పారిశ్రామిక విధానాలు దేశ ఆర్థిక ప్రగతిని మార్చివేశాయి. నాడు ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలకు పివి తెర తీశారు. భారత ఆర్థిక వ్యవస్థను 1991కి ముందు, 1991 తర్వాత అని రెండు భాగాలుగా చేసింది పివినే. నేడు భారత్ ఆర్థికంగా బలంగా ఉంది అంటే అది ఖచ్చితంగా పివి నిర్ణయమే. నాడు పివిని సొంత పార్టీ నాయకులే విమర్శించారు. ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని పదవిలో పివి ఫీట్లు చేస్తున్నారు అని నాడు ఎంతో మంది విమర్శించారు. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు.

తరాలు మారాయి.. దేశంలో స్థితి, దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మారింది అయినా కానీ సంస్కరణలు చెయ్యాలనుకున్న ప్రధానికి తిప్పలు మాత్రం తప్పడం లేదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం నాడు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఎన్ని ఇబ్బందులుపడ్డారో.. నేడు మోదీ అంతకు మించిన తిప్పలుపడుతున్నారు. నల్లధనం మీద తాను పోరాటం చేస్తానని, భారతదేశానికి చెందిన సొమ్ము ఎక్కడ ఉన్నా కానీ వదిలిపెట్టేది లేదు అని మోదీ స్పష్టం చేశారు. నల్లధనం మీద పోరాటంలో భాగంగా ప్రస్తుతం పాత పెద్ద నోట్లను రద్దుచేసిన మోదీ, భరతమాత నవభారతకు జీవం పొయ్యడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ ప్రతీసారి ప్రధానిగా ఉన్న వారికి మాత్రం పురుటినొప్పులు పడకతప్పడం లేదు. పురుటి నొప్పులకు బాదపడి తల్లి బిడ్డను ఏ తల్లీకనడం మానదు. అలాగే మోదీ కూడా ఇప్పుడు భయపడటం లేదు. మోదీ కేవలం 50 రోజులు మాత్రమే అడుగుతున్నాడు. తరతరాలుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత క్షణాలు కనీసం మోదీ పుణ్యాన అయినా కనిపిస్తాయేమో చూడాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ, దేశం పరిస్థితి అచ్చం త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ లాగా ఉంది. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.

Modi

ఆ లైన్ తీసేయగల ప్రధాని ఒక్క నరేంద్ర మోదీనే

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే లైన్ ను మా తాతలు చదివారు, మా నాన్నలు చదివారు, ఇప్పుడు మేం చదువుతున్నాం, రేపు మా పిల్లలు కూడా చదువుతారు. అయినా అభివృద్ధి చెందడానికి అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు అవసరమా అనే ఫ్రశ్న మనలో చాలా మందిలో ఉంటుంది. ఎన్నికలకు ముందు ప్రతి నాయకుడు వచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం అని తొడగొడతారు. కానీ పుష్కరకాలం గతించినా కానీ మార్పు రాదు. కానీ మోడువోయిన చెట్టులో చిగుర్లు తొడుగుతున్న అనుభూతి కలుగుతోంది. అప్పుడెప్పటి నుండో మనం వింటున్న అభివృద్ధిని మన కళ్ల ముందు చూపించడానికి ఓ మార్గం దొరికింది.

నిన్న రాత్రి కాస్త లేట్ గా అయినా ఓ స్పీచ్ విన్నా. ఆ స్పీచ్ వినేటైంలో చేతి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. చెవులు రింగులుమోగాయి. పెదవుల మీద చిరుదరహాసం.. కళ్లలో ఆనందం. ఇంతలా ప్రభావితం చేస్తున్న స్పీచ్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారా..? భారత ప్రధాని నరేంద్ర మోదీ. అవును.. గోవాలో, ఘజియాపూర్ లో మోదీ మాటలు విన్నాక, అభివృద్ధి అనే మాటకు, న్యాయం జరుగుతుంది అనిపిస్తోంది.

మోదీ మాట్లాడుతూ కేవలం యాభై రోజులు నాకు గడువివ్వండి.. దేశాన్ని మార్చి చూపిస్తా అని అన్నాడు. కానీ కొంత మంది రాజకీయ వేషగాళ్లు మోదీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. తుమ్మినా కానీ మోదీయే కారణం అని కారుకూతలు కూసే కేజ్రీవాల్, మమతా బెనర్జీలు దొరికిందే అవకాశంగా విరుచుకుపడ్డారు. దేశం మొత్తం మోదీకి అండగా నిలుస్తోంది. నిజానికి బస్సు ఛార్జీలు కాస్త పెంచితేనే గగ్గోలు పెట్టి, నానారాద్దాంతం చేసే జనం సైలెంట్ గా డబ్బుల కోసం క్యులైన్లలో నిల్చున్నారు అంటే ఖచ్చితంగా వారంతా మోదీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు అని అర్థం.

కాంగ్రెస్ చవటలు ఇన్ని సంవత్సరాలుగా చెయ్యలేని పనిని, మోదీ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు చూడండి అని గాంధీ ట్యాగ్ లైన్ తో ఇప్పటికీ నెట్టుకువస్తున్న వారు కూడా మోదీని ప్రశ్నిస్తుండటం నిజంగా సిగ్గుచేటు. ఆడా, మగా, ముసలి, ముతక అందరూ కూడా మోదీ నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నా కానీ నల్లడబ్బు బయటకు వస్తుంది.. మనకు మంచి రోజులు వస్తాయన్న గట్టి నమ్మకంతో మోదీకి అండగా నిలుస్తున్నారు. కానీ తాము చెయ్యలేని పనిని మోదీ చేస్తే మాత్రం తట్టుకోలేక.. కొన్ని విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయి. అయినా మోదీలాంటి ఏనుగు రోడ్డు మీద వెళుతుంటే అలాంటి కుక్కలు మొరగడం ఖాయం.

నాడు పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ మోదీ తీసుకువచ్చిన నల్లధనం పాలసీపై వెటకారంగా మాట్లాడారు. మోదీగారు ఫెయిర్ అండ్ లవ్లీ యోజనను తీసుకువచ్చారు. దాని ప్రకారం ఏంటంటే.. మీ నల్లడబ్బును ట్యాక్స్ కట్టడం ద్వారా తెల్లగా మార్చుకోవచ్చు అని వెటకారంగా మాట్లాడారు. కానీ అదే రాహుల్ గాంధీ అండ్ కోకు మోదీ తీసుకున్న నిర్ణయం కనీసం నిద్ర కూడా లేకుండా చేసి ఉంటుంది. రాజకీయ పరిణతిలేని రాహుల్ గాంధీ కూడా నాలుగు వేల కోసం క్యు లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. అయినా మోదీ చేసేది ముమ్మాటికి కరెక్ట్ అని దేశం మొత్తం అంటుంటే.. కొంత మంది మాత్రం తప్పు అనడం ఏంటో.

bathukamma-new

బ్రతుకమ్మ అంటే పండగ కాదు.. its a బ్రాండ్

తెలంగాణలో జరుపుకునే అతి పెద్ద స్థానిక పండగ బ్రతుకమ్మ. గంగా గౌరీలను కొలుస్తూ.. నూటొక్క పువ్వులతో అమ్మలను పూజించడం ఇందులో ఉంటుంది. గత ప్రభుత్వాల, ఆంధ్రావాళ్ల నిర్లక్ష్యం కారణంగా దాదాపుగా అంతరించే దశ నుండి అంగరంగ వైభవంగా సాగే స్థాయికి వచ్చింది బ్రతుకమ్మ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సర్కార్ ఎంతో వైభవంగా ఈ పండగను నిర్వహిస్తోంది. తెలంగాణ సర్కార్ అధికారిక పండగగా బ్రతుకమ్మను ప్రకటించడం… పండగ నిర్వహణకు నిధులు కూడా విడుదల చెయ్యడం జరుగుతోంది.

తెలంగాణ సంస్రృతిలో భాగమైన బ్రతుకమ్మకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్ కు పూర్వం, కాకతీయుల కాలం నుండి ఈ పండగ ఉనికిలో ఉంది. అయితే కొన్ని గ్రహపాట్ల వల్ల బ్రతుకమ్మకు నీలినీడలు అలుముకున్నా… తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లలో ఎెంతో ఘనంగా నిర్వహించే ఈ బ్రతుకమ్మకు ప్రస్తుతం రాజకీయ గ్రహణం వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. బ్రతుకమ్మ నుండి తమ లాభానికి చేస్తున్న రాజకీయాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్, మరికొంత మంది మేధావులు చేసిన ప్రయత్నాల్లో బ్రతుకమ్మ కూడా ఒకటి. అప్పటి దాకా అన్నింటా మన మార్క్ ను ప్రదర్శించినా కానీ పండగల విషయంలో మాత్రం ఆంధ్రా మార్క్ ఉండేది. దాంతో బ్రతుకమ్మను వెలుగులోకి తీసుకువచ్చారు. అప్పటిదాకా చరిత్రలో నిద్రాణమైన బ్రతుకమ్మను చెంగుపట్టి మన ఆడబిడ్డలు తట్టిలేపారు. అయితే ఇప్పుడు మాత్రం బ్రతుకమ్మను ఓ పండుగలాగా కాకుండా కేవలం తెలంగాణ బ్రాండ్ గా చాలా మంది చిత్రీకరిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం టైంలో వచ్చిన ఈ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికీ చాలా మందికి మైలేజ్ ఇస్తోంది. తెలంగాణ అంటే బ్రతుకమ్మ అనే స్థాయికి నాడు ఉంటే.. బ్రతుకమ్మ ఎత్తితే మైలేజ్ మంచిగా ఉంటుంది అనే స్థాయికి ఇప్పుడు చేరింది. ఇప్పటికే చాలా మంది బ్రతుకమ్మను తల మీద కేవలం ఫోటోల కోసం మాత్రమే పెట్టుకుంటున్నారు అన్నది వాస్తవం. ఇక మరికొంత మంది మాత్రం మా ‘అమ్మ’ బ్రతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ అని డబ్బాలు కొడుతున్నారు. అయినా పండగను కేవలం పండగ.. తెలంగాణ సంస్రృతి అని భావించకుండా దాన్ని తమ లాభానికి వాడుకోవడం వల్లే ఇలా ఉంది పరిస్థితి.

ఎంపీ కవిత పేరు ఎందుకు?
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాలుపంచుకున్నారు. కాగా బ్రతుకమ్మ పండగకు మరింత ప్రచారాన్ని కల్పిస్తూ నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ మొత్తం తిరిగారు. అయితే ఆ సందర్భంలోనే చాలా మంది బ్రతుకమ్మ అంటే కవితమ్మ అని, తెలంగాణ సర్కార్ బ్రతుకమ్మ పండుగకు కవితమ్మ పండగ అని పేరు పెట్టాలని కూడా విమర్శించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. బ్రతుకమ్మను కొన్ని జిల్లాల్లో కవిత పరిచయం చేస్తూ ప్రచారం చేసింది అన్నది మాత్రం వాస్తవం.

కవిత ఎందుకు వద్దు?
ఎంపీ కవితను బ్రతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు వద్దు అని అంటున్నారు అనేదానికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది రాజకీయ కారణం. కవిత టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకురాలు. తెలంగాణ పండగ అయిన బ్రతుకమ్మను ఓ పార్టీకి చెందిన వ్యక్తి బ్రాండ్ కింద వేస్తే అది మంచిది కాదు అనేది కొంత మంది వాదన. తెలంగాణ కోసం పోరాడిన చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, విమలక్క లాంటి వాళ్లను కాకుండా కవితను బ్రతుకమ్మకు బ్రాండ్ గా ప్రచారం చెయ్యడం ఏంటి అని మరోవాదన.

మొత్తానికి పండగను పండగలాగా కాకుండా దాన్ని మార్కెట్ లో విలువున్న బ్రాండ్ కింద ట్రీట్ చెయ్యడం అంత మంచిది కాదు. తెలంగాణ ప్రజల సంస్రృతిలో భాగమైన బ్రతుకమ్మకు బ్రాండ్ వ్యాల్యూ అద్దడం ఏమాత్రం మంచిది కాదు. అన్నింటికి మించి బ్రతుకమ్మకు బ్రాండ్ విలువను అద్దిన మీడియా ఇక మీదటైనా తన వైఖరిని మార్చుకొని బ్రతుకమ్మకు పూర్వవైభవాన్ని కల్పిస్తుంది అని ఆశిస్తున్నా.

Modi perfect answer with surgical stike

నరేంద్ర మోదీ.. ఓ మగాడు, మొగుడు

భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అడుగు వేశాడు. భారత రక్షణ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించే ఓ అధ్యాయానికి అంకురార్పణ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు తమ డైరీల్లో రక్తాక్షరాలను లిఖించుకునేలా భారత ఆర్మీని ఎంతో నేర్పుగా వాడారు మోదీ. యుపిఎ సర్కార్ కంటే ఎన్డీయే సర్కార్ ఉంటే ఖచ్చితంగా దేశరక్షణ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు అనే నమ్మకానికి మరోసారి నిదర్శనాన్ని చూపారు. మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్ కు ప్రేమ లేఖలు కాదు.. బుల్లెట్లు పంపుతారు అని ఎంతొ మంది నమ్మిన నమ్మకాన్ని రుజువు చేశారు.

పాకిస్థాన్ ఆక్రమిక కాశ్మీర్ లోకి భారత్ ఆర్మీ చొచ్చుకువెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్ అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. మోదీ సహనాన్ని అలసత్వంగా తీసుకున్న పాకిస్థాన్ పదేపదే తన ఉగ్రపంజా విసిరింది. భారత ఆర్మీ బలం ఏంటో.. మోదీ స్ట్రాటజీ ఏంటో కేవలం ఒకే ఒక్క దాడితో నిరూపించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియ్యడమే కాకుండా.. భారత ఆర్మీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు మోదీ.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ ఏం చెయ్యలేకపోతున్నారు.. నాడు చూపించిన 56 ఇంచుల ఛాతి ఎక్కడికి పోయింది అన్న విమర్శకులకు ఒకే ఒక్క ఘటనతో నిరూపించారు. ఆలస్యంగా అయినా కాస్త ఆలోచనతో వేసిన మోదీ అడుగు పాకిస్థాన్ ఉగ్రవాదులకు, అక్కడి సేనలకు ప్యాంటు తడిసేలా చేసింది. మన ఆర్మీ బేస్ మీద దొంగచాటుగా పాక్ ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా.. వారి భూభాగంలోనే 39 ఉగ్రవాదులను హతమార్చి.. మోదీ దైర్యం ఏంటో నిరూపించారు.

లాల్ బహదూర్, వాజ్ పేయి చెయ్యలేనిది మోదీ చేసి..
చరిత్రలో పాకిస్థాన్ మీద ఇలాంటి దాడులకు పాల్పడిన మొదటి ఘటన కూడా ఇదే. నాడు లాల్ బహదూర్ శాస్త్రి దగ్గరి నుండి వాజ్ పేయ్ వరకు మన ప్రధానులు పాకిస్థాన్ కు శాంతి కపోతాన్ని పంపితే వాళ్లు మాత్రం దాన్ని చంపేస్తున్నారు. పార్లమెంట్ మీద దాడి ఘటన తర్వాత కూడా వాజ్ పేయి గట్టిగా పాకిస్థాన్ కు బదులివ్వలేదు అని ఇప్పటికీ విమర్శ. కానీ లాల్ బహదూర్ శాస్త్రి, మోదీ చెయ్యలేని సహసాన్ని మోదీ చేసి.. పాకిస్థాన్ కు ధీటైన సమాధానమిచ్చారు.

మగాడు అంటే ఎలా ఉంటాడో నిరూపించాడు మోదీ. పాకిస్థాన్ ముష్కర సేన మన ఆర్మీ క్యాంపుల మీద దాడి చేస్తే.. పాకిస్థాన్ ప్రధాని కడుపు మండిన కాశ్మీరీలు ఇలా చేసి ఉంటారు అని చతురత ప్రదర్శించారు. మన మోదీ మాత్రం తన దైర్యాన్ని చూపించారు. పాకిస్థాన్ కలలో కూడా ఊహించని విధంగా వారి భూభాగంలోనే పాకిస్థాన్ ఉగ్రవాదులను హతమార్చేసింది మన ఆర్మీ.

ఉరీ ఘటన తర్వాత పాకిస్థాన్ భారత్ మీద కాదు.. పేదరికం మీద పోరాటం చెయ్యాలి అన్న ప్రకటన చాలా మందిలో నిరుత్సాహం నింపింది. ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దాడి చేస్తే తాట తీస్తాం అన్న మోదీ ఇలా మాట్లాడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అలా అని తన రాజనీతిని నిరూపించాడు. ముందుగా పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజంలో తలదించుకునేలా చేసి.. సార్క్ సమావేశాల్లో ఏకాకిని చేసి.. అప్పుడు దెబ్బ తీశాడు. పాకిస్థాన్ కు సరైన మొగుడు నరేంద్ర మోదీనే అనేలా చేశాడు.

పాకిస్థాన్ నుండి ఇప్పటి దాకా ఎన్నో సార్లు దాడులు జరిగాయి. మన వాళ్లు ఎంతో మంది చనిపోయారు. పాకిస్థాన్ కు ఎన్నో సార్లు మన వాళ్లు హెచ్చరికలు జారీ చేశారు. కానీ కుక్క బుద్దిలాగా తన వైఖరి మార్చుకోలేదు. అందుకే మోదీ ఒకే ఒక్క దాడి చేయించారు. అంతే నిన్నటి దాకా ఉన్న చరిత్ర మొత్తం తుడుచుకుపోయింది. పాకిస్థాన్ కు భారత్ ఇలా కూడా చెయ్యగలదు అని నిరూపించాడు. పాకిస్థాన్ లోకి దూరి చంపే సీన్లు కేవలం సినిమాల్లో మాత్రం చూపించడం జరుగుతుంది.. కానీ రియల్ లైఫ్ లో అది చేతకాదు అన్న వారికి సర్జికల్ స్ట్రైక్ ఒక గుణపాఠం అవుతుంది. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన మోదీ నిజంగా పాకిస్థాన్ కు తగ్గ మగాడు, మొగుడు

india-vs-pakistan

భారత్-పాక్ యుద్ధంలో వీళ్లెటు..?

ఈ ప్రశ్న చదివేటప్పుడు కొంత మంది మనసులో ఖచ్చితంగా బారత్ వైపు అని.. మరికొందరు మాత్రం భారత్ వైపేనా..? అనే అనుమానాలు కలుగుతుంటాయని నాకు తెలుసు. అసలు భారత్ తో పాకిస్థాన్ యుద్ధాన్ని మన సైన్యాన్ని గట్టిగా ఎదర్కోగలుగుతుుంది అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అసలు భారత్- పాకిస్థాన్ యుద్ధంలో పౌరుల వైఖరి ఎవరికి మద్దుతుగా ఉంటుంది అనేదే ఎంతో మందిని కదిలించే ప్రశ్న.

కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు, పశ్చిమబెంగాల్ నుండి గుజరాత్ వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సమాధానాన్ని వ్యక్తం చెయ్యవచ్చు. కొంత మంది అసలు భారత్ కు మద్దతు ఇస్తారని ఎప్పుడే ఊహించవద్దు అని కూడా అనవచ్చు. అయితే అసలు వాస్తవ పరిస్థితులను గమనిస్తే విషయం ఏంటో అర్థమవుతుుంది. అసలు పాకిస్థాన్ తో యుద్ధానికి కారణమయ్యే జమ్ము కాశ్మీర్ లో పరిస్థితి దేశం మొత్తంలో ఆ వర్గం భారత్ కు మద్దతునిస్తుుందా..? లేదా..? అన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుపుతుంది.

కాశ్మీర్ లో మతతత్వం కొన్ని చోట్ల వేళ్లూనుకుంది. అక్కడి యువతలో విద్వేషాలను రగిల్చి పాకిస్థాన్ అయితేనే తమ స్వర్గంగా భావించేలా చేసింది. దాంతో అక్కడ చాలా మంది యువకులు మిలిటెంట్లుగా మారుతున్నారు. దీనికి చనిపోయిన మిలిటెంట్ బుర్హాన్ వనీనే నిదర్శనం. బుర్హాన్ వనీ హత్య తరువాత జరిగిన పరిణామాలు చాలా మారాయి. కాశ్మీర్ లో ఓ వర్గం జనాభా చాలా ఎక్కువ. పాకిస్థాన్ నుండి వచ్చే ఉగ్రవాదులకు చాలా వరకు కాశ్మీరీలు( అదే వర్గానికి చెందిన వారు) అండగా నిలుస్తున్నారు.. కాబట్టే భారత్ మీద దాడులు ఇంకా జరుగుతున్నాయి. ఇక్కడ పాకిస్థాన్ నుండి వస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నది ఆ వర్గం కార్డే. ఆ టోపీ పెట్టుకుంటే మన వాడు అన్న భావన వారిలో ఉంది కాబట్టే దాన్ని భారత్ మీద దాడులకు ఉపయోగిస్తోంది పాకిస్థాన్. పశ్చిమ బెంగాల్ లోనూ దాదాపు ఇదే పరిస్థితి.

మరికొంత మంది అదే వర్గానికి చెందిన వాళ్లు మాత్రం పాకిస్థాన్ ఎప్పటికీ మా దేశం కాదు.. భారత్ మా దేశం అని గట్టిగా చెబుతున్నారు. ఇలా ఎందుకు అంటే భారత స్వేచ్ఛా వాయువులను వారు అనుభవిస్తున్నారు. పుట్టిన గడ్డ మేలును ఎప్పటికీ మరిచిపోని అసలు భారతీయులు వీళ్లు. మరి ఒక ఏరియాలో పరిస్థితి ఇలా ఉంటే భారత్ మొత్తంలో పరిస్థితిని అంచనా వెయ్యడం కష్టం. భారత్ లో దాదాపు 12 శాతానికిపైగా ఉన్న వారి జనాభా అభివృద్ధిలోనూ, వినాశనంలోనూ ఎంతో కీలకంగా మారుతుంది.

భారత్ విశ్వవినీలాకాశంలో దూసుకెళుతోంది. మరి ఈ దశలో ఆ వర్గం వాళ్లు భారత్ కు మద్దతుగా ఉంటారా..? లేదంటే భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తారా..? ఇందులో గమనించాల్సింది రాజకీయ కోణాన్ని. ఇండియా ఎప్పుడూ ఆ వర్గాన్ని ఓటు బ్యాంకుగా గుర్తించే మన పోలికిల్ పార్టీల నిర్వాకం కారణంగానే అనర్థాలు జరుగుతాయి తప్పివే వేరే ఏ కారణమూ లేదు అన్నది వాస్తవం. అయోధ్యలో ఘటన నుండి ముజాఫర్ నగర్ లో హత్యల వరకు అన్నీ రాజకీయ హత్యలే. రాజకీయ లాభం కొసం అసదుద్దీన్ ఓవైసీలాంటి నాయకులు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలే దీనికి ముఖ్య కారణం.

నలుగురు ఆ వర్గానికి చెందిన వ్యక్తులు కలిస్తే వేరే వర్గానికి చెందిన వాళ్లను పెద్దగా పట్టించకోరు.. ఆ వర్గానికి చెందిన వాడు తప్పు చేసినా కానీ వెంటేసుకుంటారు అనే భావన మనలో చాలా మందికి ఉంది. మరి అదే యుద్ధం విషయంలో కూడా జరిగితే.. ఖచ్చితంగా జరగదు. ఎందుకు అంటే భారత్ లో పుట్టిన ప్రతి బిడ్డ ముందుగా భారతీయుడు.. ఆ తర్వాతే ముస్లిం లేదంటే హిందు లేదంటే క్రిస్టియన్. అయితే జెండాలకు కూడా వందనం చెయ్యని. జాతీయ గీతం పాడడానికి కూడా నోళ్లుపెగలని చాలా మంది గుంట నక్కల కారణంగా.. ఒకవేళ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా రావచ్చు కానీ లేదంటే ఖచ్చితంగా వారి మద్దతు భారత్ కే.

                                                           జై హింద్ – జై భారత్