AP Cm Chandrababu naidu facing problems with his self mistakes

ప్రెస్ మీట్ల చంద్రం ‘తొందర’.. అంతటా నవ్వుల పాలు

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని ముఖ్యమంత్రిగా, అభివృద్ధికి అందెలద్దిన సిఎంగా గుర్తింపు ఉన్నా ఇప్పుడు మాత్రం నవ్వుపాలవుతున్నారు. తత్వం బోధపడక చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి చివరకు మీడియాలో ఆయనను నవ్వుపాలుచేస్తోంది. రెండు టర్ములు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ ఏ అంశం మీద ఎలా స్పందిచాలో తెలియక జనాలకు లేని చర్చకు తావిస్తున్నారు.

మొత్తం ఆర్టికల్ ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements
there-is-no-chance-to-chandrababu-in-ap-and-kcr-will-be-lagend-in-telangana/

బాబుకు అవకాశం లేదు… కేసీఆర్ కు తిరుగులేదు

విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓ రాష్ట్రం వెలుగు విరజిమ్ముతుంటే.. మరో రాష్ట్రం మాత్రం చీకట్లో జారుకుంది. తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా కొనసాగుతుండగా, ఏపి మాత్రం లోటుతో నడుస్తోంది. ఇక సిఎంల విషయానికి వస్తే మాత్రం ఏపిలో నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల టైంలో ఉన్న మెజారిటీలో పావు వంతు కూడా వచ్చే ఎన్నికల్లో రాదు అని చాలా సర్వేలు తేల్చాయి. తెలుగుదేశం పార్టీకి రానురాను మైలేజ్ తగ్గుతుండటంతో చంద్రబాబు నాయుడు సర్కార్ లో భయం పట్టుకుంది. ఏపిలో ప్రభుత్వం మీద ఉన్న అసమ్మతి ఎలా ఉంది అనే దానిపై చంద్రబాబు నాయుడు పలు దర్యాప్తు సంస్థల నుండి, ధర్డ్ పార్టీ సర్వేల్లో కూడా బాబు సర్కార్ కు ఈసారి షాక్ తగనుట్లు వెల్లడైంది.

ఈ ఆర్టికల్ ఒరిజినల్ కాపీని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏపికి ప్రత్యేక హోదా రావాలంటే కేసీఆర్ సలహా ఇదే..

KCR suggetion to get special status for andhrapradesh

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి దీక్షాదక్షుడో అందరికి తెలుసు.. సింపుల్ గా చెప్పాలంటే తను అనుకున్నది సాదించే వరకు వెనక్కి తగ్గని మోనార్క్ అని. ఎన్నో దశాబ్దాల తెలంగాణ రాష్ట్రాన్నిసాధించి పెట్టింది కూడా ఆ మొండి తనమే. ఓ పక్క రాజకీయంగా ప్రత్యర్థులకు చెక్ చెబుతూనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అయితే రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు చాలా మారిపోయాయి. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉండగా.. ఏపి మాత్రం లోటు బడ్జెట్ ను కలిగి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపికి అన్ని విధాల న్యాయం చేస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పింది కానీ లిఖితపూర్వకంగా ఎక్కడా రాసి ఇవ్వలేదు. దాంతో యుపిఎ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కూడా ఏపి ప్రజల జీవితాలతో చలగాటమాడుతోంది.

ఇలా మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆటలను కట్టించి.. ఏపికి ఎలా ప్రత్యేక హోదా సాధించుకోవాలో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎంతో వివరంగా వివరించారు. నిజంగా వీటిని గనక ఏపి ప్రజలు ఫాలోయితే మాత్రం కేంద్రం దిగివచ్చి.. స్పెషల్ స్టేటస్ ను ఆగమేఘాల మీద ప్రకటించడం ఖాయం. ఇంతకీ కేసీఆర్ ఏం చెప్పాడు.. ఏం చెయ్యాలి అని అప్పుడే అనుకుంటున్నారా..?

* అన్నింటికన్నా ముందు అప్పుడెప్పుడో వేమన చెప్పినట్లు.. ఓ పనిని ప్రారంభించి వదిలేసేటట్లు ఉంటే అసలు దాన్ని ప్రారంభించకపోవడమే మంచిది. కాబట్టి ఖచ్చితంగా సాధిస్తాం అనే నమ్మకంతో ప్రారంభించండి.
*ఇక ఉద్యమాన్ని ఉప్పెనలా తీసుకెళ్లాలంటే అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో.. భావి తరాల వారికి దాని వల్ల కలిగే లాభాలను, ఇప్పటికిప్పుడు ఏపికి వచ్చే లాభాలను ప్రజలకు వివరించాలి.
* ఉద్యమంలో ఖచ్చితంగా మాటల తూటాలు, సాహిత్యం కీలకదశకు చేరుస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అంత ఉృతంగా తీసుకెళ్లడానికి వేల మంది కళాకారులు కృషి చేశారు.
* అన్నింటికి మించి విద్యార్థి శక్తి ముందు ఏ శక్తీ తాళలేదు కాబట్టి యూనివర్సిటీలను ఉద్యమానికి కేంద్ర బిందువులు మారిస్తే మంచింది.
* ఉద్యమం సెగ దిల్లీకి తగలాలి అంటే అక్కడ ఉన్న ఎంపీలు కేంద్రానికి అల్టిమేటం జారీ చెయ్యాలి.. నెల రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకోవాలని లేదంటే రాజీనామా చేస్తామని వెల్లడించాలి. ఒకవేళ ఎంపీలు అలా చెయ్యకపోతే ఏపిలో పరిస్థితులు అలాంటి కష్టమైన పరిస్థితులను కల్పించాలి.
* ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా జేఏసీ ఏర్పడాలి.
* గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో ఎలా అయితే ఏపి మొత్తం ఏకమైందో అలాగే ఇప్పుడు కూడా ఏకంగా కావాల్సిన ఆవశ్యకత ఏర్పడాలి.
*ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాలి…. కేంద్రం నుండి ప్రత్యేక హోదా అనే ప్రకటన తప్ప వేరే దేని గురించి పట్టించుకోరాదు.
* కేంద్రం నిధులు ఇస్తామని ముందు నుండి అంటోంది.. కానీ రెండు సంవత్సరాల్లో ఇచ్చింది లేదు. కాబట్టి ప్రత్యేక నిధిని ఇస్తాం అంటే కేవలం ప్రత్యేక హోదా మాత్రమే కావాలని పట్టుబట్టాలి.
*ఇక ఉద్యమ సెగ దిల్లీకి తాకాలంటే ఏపిలో పరిస్థితులు మారాలి.. ప్రజావ్యవస్థను మొత్తం స్తంభించాలి. అందుకు ప్రజలనను ముందే సిద్దం చెయ్యాలి.. అది ఐదు రోజులుకావచ్చు.. యాభై రోజులు కావచ్చు కానీ దానికి సిద్దంగా ఉండాలి.

అయితే ఇది ఒక్క రోజుతో ముగిసిపోయే పోరాటం కాదు కాబట్టి అన్నింటికి మించిన ఆత్మవిశ్వసం, ఓపికి ఉండాలి. రెచ్చగొట్టే వాళ్లు ఉంటారు.. నీరుగార్చే వాళ్లుంటారు. అయినా కానీ ముందుకు సాగాలి. వచ్చిన వారిని కలుపుకొని పోవాలి.. కలిసిరాని వారిని తమలో ఎలా కలుపుకుపోవాలో ఆలోచించాలి. అన్నింటికి మించి నాయకులు ఎవరూ కూడా కొంత మందికి వంతపాడే వైఖరిని అవలంభించరాదు. ఔర్ ఏక్ దక్కా.. తెలంగాణ పక్కా అన్న నినాదంలా.. ఒకే ఒక్క షాక్ తో కేంద్రం కిందికి దిగివస్తుంది. గతంలో నందమూరి తారకరామారావు ఇచ్చినట్లు దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చెయ్యాలి. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని అన్నట్లే.. ఏపికి ప్రత్యేక హోదా లేదంటే బలిదానాలకు, బలితీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలి.

తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!

Modi-to-telugu-States

భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో, దేశంలో చాలా చోట్ల ఆయనకు బ్రహ్మరథం పట్టవచ్చు కానీ ఆయన మాత్రం తెలుగు వారిని వెర్రి వెంగళప్పలను చేస్తున్నారు. అదేంటి మోదీ అందరి అభివృద్ది కోసమే కదా పని చేస్తున్నారు అని అనుకుంటున్నారా..? కానీ తెలుగు వారి విషయానికి వస్తే ఇక్కడ కండీషన్స్ అప్లై అన్నట్లుంది వ్యవహారం. తెలుగు వారి గురించి ఎన్నికల టైంలో చేసిన ప్రకటనలు, మాట్లాడిన మాటలు వింటే ముక్కున వేలేసుకుంటారు. మరి ఇప్పుడు అదే తెలుగు వాళ్లకు ఆయన చేసిందేముంది అనే దానికి సమాధానం వెతికే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే సమాధానం దొరకడం కొంచెం కష్టంకాబట్టి.

తెలుగు వాళ్లు మా గుజరాత్… మా సూరత్ లో ఉన్నారు. వాళ్లను ఎప్పుడూ మా ఇంటి వాళ్లలాగానే చూసుకుంటాం అంటూ మాట్లాడారు మోదీ. కానీ ఇప్పుడు తెలుగు వారి ఇళ్లు దారుణంగా మారాయి. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత సవాళ్ల మధ్యన పడవలేసుకు నడుస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన చేసిందేమీ లేదు. కేంద్రం నుండి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తాము ముందుండి.. అడగక ముందే చేస్తామని చెప్పిన మోదీ కనీసం ఎంగిలి చేయిని కూడా విదల్చడం లేదు.

ఏపిలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ద్రవ్యలోటు ఉంది. దాన్ని పూడ్చేందుకు కేంద్రం నిధుల సహాయం చెయ్యాలి. దిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు దానిపై మోదీకి లేఖలు అందిస్తారు.. సరే మోదీని కలిశారు కదా అని ఏదో ఫార్మాల్టికి వెయ్యకోట్లు విడుదల చేసి మేం సహాయం చేశాం… మీరు ఊహించనంత సహాయం చేస్తాం అంటూ ప్రకటిస్తారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడమే మానేశారు.. నిధుల గురించి మాట్లాడితే ఉలకరుపలకరు. మరి ఏపిలో ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బిజెపి నాయకులు, అందునా మోదీ ఇలానేనా చేసేది అంటే రాజకీయం అంటే ఇదేరా అన్నట్లు సమాదానాలు వస్తున్నాయి.

ఇక ముందు నుండి కూడా తెలంగాణలో టిఆర్ఎస్ తో సానుకూల వాతావరణం లేదు. దాంతో టిఆర్ఎస్ తో పొత్త చర్చలు కూడా జరగలేదు. దాంతో కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సహాయం చెయ్యడం లేదు. తెలంగాణ స్వతహాగా పైకి ఎదుగుతున్న రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అంటూ సవాలక్ష కారణాలు చూపిస్తూ.. చివరకు చేతికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నారు. మొత్తానికి మోదీ తెలంగాణ, ఏపిలలో తెలుగు వాళ్లను వెర్రివెంగళప్పలను చేసి.. కాలం వెల్లదీస్తున్నారు. మరి దీనిపై తెలుగు వాళ్లు ఎన్నికల్లో ఎలా సమాధానమిస్తారో చూడాలి.

జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు…?

YS-Jagan-Assets-attached

Image source: full updates

వైయస్ జగన్ కూడబెట్టిన ఆస్తులు అన్నీ అక్రమమే అని ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ముందు నుండి కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సాక్షి మీడియాతో సహా అతడి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుంటుందని కూడా గతంలో ప్రకటన చేశారు. అయితే తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరవ సారి జగన్ కు చెందిన 749 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. లోటస్ పాండ్ తో సహా, బెంగళూరులోని ప్యాలెస్ ను కూడా ఈడీ అటాచ్ చేసింది. మాటలు కోటలు దాటినా కాళ్లు మాత్రం గడప దాటడం లేదన్నట్లు గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు ఆస్తులను ప్రభుత్వపరంగా చెయ్యడానికి ఇది సరైన టైం కానీ.. బాబు గారు మాత్రం దానికి ముందుకు రావడం లేదు.

జగన్ ఆస్తులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడూ వార్తలు రాసే సాక్షి మీడియాను టార్గెట్ చేశారు. అందుకే ఖచ్చితంగా సాక్షి మీడియాను ప్రభుత్వపరం చేస్తామని… అది ప్రజల ఆస్తి అని ముందు నుండి కూడా చంద్రబాబు అంటున్నారు. మరి ఇప్పుడు ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు జగన్ కు చెందిన అన్ని ఆస్తులను ప్రభుత్వపరం చేసుకోవచ్చు కదా అని వాదన వినిపిస్తోంది. కేంద్రంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బిజెపి పార్టీనే. పైగా మోదీ, చంద్రబాబు మంచి స్నేహితులు అనే వార్త కూడా ఉంది. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఈ దిశగా ఎందుకు అడుగులు వెయ్యలేకపోతున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చసాగుతోంది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పటికే జగన్ ముచ్చెమటలు పట్టిస్తున్నారని, ఇప్పుడు జగన్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేస్తే ఖచ్చితంగా విపరీత పరిణామాలు తప్పవని బాబు సన్నిహితులు హెచ్చరిస్తున్నారట. అందుకే బాబు దీనిపై కాస్త వెనక్కి తగ్గినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పైగా కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ అనుకున్న రీతిలో సహకరించడం లేదని…. అనవసరంగా ప్రయత్నించి ఎందుకు పేరు పోగొట్టుకోవాలని కూడా బాబు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు దూరమైన ఓ వర్గం జగన్ కు అనుకూలంగా మారిందని… ఈ టైంలో జగన్ ను టచ్ చేస్తే ఆ సామాజిక వర్గం ఆగ్రహం ఎదుర్కోవలసి వస్తుందని కూడా చంద్రబాబు అడుగు ముందుకు వెయ్యడం లేదని తెలుస్తోంది.

వెండితెర పై రైతు రాజకీయం

POlitical-farmers-abhi

రైతే రాజు.. రైతే దేశానికి వెనముక అనే పదాలను చిన్నప్పటి నుండి వింటున్నాం, కానీ అదే రైతుకు తినడానికి తిండిలేక, అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది నాయకలు మారినా రైతుల పరిస్థితి మాత్రం మారదు. రైతుల పక్షాన మేముంటాం అంటూ మన రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు సినిమా వాళ్లు కూడా అదే కోవకు చెందుతున్నారు. నిజానికి రైతుల కష్టాలు అనేది ఎప్పటికి బర్నింగ్ సబ్జెక్ట్ అందుకే చాలా మంది సినిమా వాళ్లు దాన్ని వాడుకుంటారు. అయితే తెలుగు నాట ఇప్పుడు ఇద్దరు అగ్రశ్రేణి నటులు, నాయకులు చేస్తున్న సినిమాలు వెండితెర మీద రైతుల పేరుతో రాజకీయ లాభం అనే అంశానికి తెర తీశాయి. అర్థంకాలేదా..? మొత్తం స్టోరీ చదవండి.

రైతు నిజానికి కమర్షియల్ గా లాభాల్లో లేకున్నా కానీ అతడి చుట్టూ తిరిగే సినిమాలు మాత్రం కమర్షియల్ గా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాతో మన ముందుకు తలకు తలపాగా బదులు స్టార్ డమ్ ను చుట్టుకొని వస్తున్నారు కొత్త రైతులు. వీళ్లు చేసేది వ్యవసాయం కానీ స్క్రీన్ మీద మాత్రమే. ఇంతకీ వాళ్లు ఎవరు అనుకుంటున్నారా.? ఒకరు ఓ తెలుగు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన రైతు బాలకృష్ణ.. మరొకరు ప్రతిపక్షానికి చెందిన ఎంపీ చిరంజీవి. మరి ఈ వెండితెర వ్యవసాయంతో వీరు పండించాలనుకుంటోన్న పంటలేంటో చూద్దాం.

తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి రైతుల సమస్యలతో ముడిపడిన కథాంశంతోనే ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా సెజ్ ల పేరుతో తాము కోల్పోతున్న భూమి కోసం కొందరు గ్రామస్తులతో కలిసి ఓ యువకుడు సాగించిన పోరాటమే.. తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కత్తి నేపథ్యం. ఇలా తన సినిమాలో రైతులకు అండగా నిలిచే ఓ నాయకుడిగా చిరు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ద్వారా చిరంజీవికి రెండు రకాల లాభాలు కలుగుతాయి.

చిరుకు లాభాలు..
1. రీఎంట్రీకి రైతుల సమస్య అనే బలమైన సబ్జెక్ట్ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది
2. పొలిటికల్ లీడర్ గా కూడా రైతుల్లో చిరంజీవికి ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

చిరంజీవి తన రీ ఎంట్రీ కోసం.. తన ఇమేజ్ కోసం ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ కాకుండా ఇలా రైతు సబ్జెక్ట్ నే ఎంచుకోవడం వెనక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనేది సత్యం. ఇది ఆల్రెడీ హిట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి.. ఈ సినిమాతో అటు కమర్షియల్ హిట్ కొట్టినట్టూ ఉంటుంది.. ఇటు రాజకీయంగా తనకూ లబ్ధి చేకూరుతుంది. అతేకాక మొన్నామధ్య ఓ టివి ఫంక్షన్ లో ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని రాజకీయ నాయకుడి తరహాలో హామీలిచ్చేశాడు. అంటే ఓ రకంగా ఈ సినిమాతో ఆంధ్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే ప్రణాళికలేవో రచించుకునే ఉంటాడు అనుకుంటున్నారు.

ఇక మరోపక్క నందమూరి నటసింహం బాలకృష్ణ 101 సినిమాలో రైతుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని గమనించాలి. చిరంజీవి తీస్తున్న సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా రాబోతోంది. ఒకవేళ చిరంజీవి తన రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకుంటే… అదే సినిమాను వాడుకొని.. నాడు ఎన్టీఆర్ చేసినట్లు ప్రభుత్వాన్ని వెనకేసువస్తాడు అనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి వెండితెర మీద రైతు రాజకీయం బాగా రసవత్తరంగా ఉండబోతోంది అనేది మాత్రం వాస్తవం.

సినిమా కాదు. ఎన్టీఆర్ గురి వేరేనా..?

NTR-Not-For-Cinemas

యంగ్ టైగర్ గా ఎంతో మంది ముద్దుగా పిలుచుకునే ఎన్టీఆర్ కుటుంబ నేపథ్యం గురించి అందరికి తెలిసిందే. ఆయన తాత నందమూరి తారకరామారావు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. దిల్లీ పెద్దల పాదాల వద్ద తెలుగు వారు మోకరిల్లుతుంటే.. కాదు కాదు తెలుగు వాడి ఆత్మగౌరవం అంటూ వీధుల్లోకి వచ్చి గర్జించి తెలుగుదేశం ను స్థాపించారు. తెలుగు వారిని ఒక్కటిగా చేసిన ఘన చరిత్ర ఒక్క ఎన్టీఆర్ కే ఉంది. ఆయన తర్వాత ఎంత మంది వచ్చినా కానీ సాటిరారు. ఇప్పుడు సినిమాల్లో వెలుగుతున్న ఎన్టీఆర్ కు కూడా తాత గారి రూపం, పేరు, నటన ఉన్నాయి.

ముందు నుండి కూడా తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసులు కేవలం నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే. సీనియర్ ఎన్టీఆర్ కు అల్లుడైన చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను చేపట్టారు.నిజానికి ప్రజా చైతన్య యాత్ర పేరుతో పెద్ద ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళితే ఆ రధాన్నినడిపించింది హరికృష్ణ. దాదాపు ఎన్టీఆర్ కోసం తన జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలను అంకితం చేశారు.మొన్న ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని గుర్తుకు చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన టైంలో చాలా మందికి ఈ విషయం కూడా తెలుసు.కానీ అవకాశాలను అందుకోవడంలో చంద్రబాబు అంత స్పీడ్ గా హరికృష్ణ లేకపోవడంతో నేటి పరిస్థితి తలెత్తింది.

నందమూరి అభిమానుల్లో, ఇంకొంత మంది తెలుగుదేశం పాత తరం అభిమానుల్లో తెలుగుదేశం పార్టీకి నందమూరి వారసులే సారధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ మధ్యన తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ తన స్టైల్లో తాతగారిని మరిపించారు. పాత ఎన్టీఆర్ తిరిగి మనవడి రూపంలో వచ్చాడని చాలా మంది అనుకున్నారు కూడా. కాగా తాజాగా ఎన్టీఆర్ చేస్తున్న చిన్న చిన్న పనులు కొంత మందికి అనుమానాలు రేకిస్తున్నాయి.

తెలుగు సినిమాల్లో వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ కు ఈ మధ్యన విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ అగ్రహీరోకూ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. తాజా సినిమా జనతాగ్యారేజ్ లో భాగంగా ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ను కలవడం చేస్తున్నారు జూనియర్. గతంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో చాలా అభిమానంగా ఉన్నా కానీ ప్రస్తుతం మాత్రం ఆయన తీరులో చాలా మార్పు వచ్చిందని దగ్గరి వాళ్లు చెబుతున్న మాట.

బహుశా పవన్ బలపడుతాడు అన్న అనుమానంతో ఎన్టీఆర్ ముందస్తుగా… ఇలా తన బలాన్ని పెంచుకుంటున్నారు అనే ఓ వాదన ఉంది. కాదు కాదు తెలుగుదేశం పార్టీ మీద ఆధిపత్యం కోసం హరికృష్ణ వదిలిన బాణం జూనియర్ అని మరో వాదన ఉంది. ఏది నిజమో కాలమే నిర్ణయిస్తుంది.