ExPM Manmohan Singh spoke in Parlimentary and he said that people will loose confidence on currency with the Demonetisation effect

నోటు..నమ్మకం ఓ మన్మోహన్!!

నిన్నటి దాకా కళకళలాడిన పచ్చనోటు, మోదీ ఒక్క ప్రకటనతో వెలవెలబోయింది. నల్లధనాన్ని అడ్డుకునేందుకు మోదీ తీసుకున్న కీలక నిర్ణయంతో సామాన్యుడు సైతం షాక్ తిన్నాడు. పాతకాలంలో మనపెద్దవాళ్లు చెప్పినట్లు ప్రతి మనిషి తన జీవితకాలంలో ఓ ఆవు, కోడిగుడ్డంత బంగారం సంపాదించుకోవాలి.. అది ఖచ్చితంగా ఆపదకాలంలో కాపాడుతుంది అని అనే వాళ్లు. ఆవు సంగతిపక్కన బెడితే బంగారం విషయంలో మాత్రం నిజమే అనిపిస్తోంది. అందుకే కావొచ్చు మనవాళ్లు గతంలో తమ వద్ద ఎంత ఉన్నా బంగారం కొనేవాళ్లు. మోదీ సీజన్ లో మరోసారి అదే రిపీట్ అవుతుందా? బంగారం పాతిపెట్టే రోజులు మళ్లీ వస్తాయా? అనే చర్చకు తెరలేచింది.

మొత్తం ఆర్టికల్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements
Modi may face either hell or heaven with Demonetization effec

పాలసంద్రం.. పాతాళం మధ్యలో మోదీ!!

ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో మొత్తం దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు. ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు అంటే అదేదో అనుకునేరు కేవలం క్యులో నిలబడేలా చేశారు అనే ఉద్దేశంలో అన్నాను. ఇక మోదీ పెద్దనోట్లను రద్దు చేసి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవాలంటే సవాలక్ష కండీషన్స్ విధించారు. అయితే దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు మోదీ చేస్తున్న ప్రయోగాలకు తాము తాత్కాలికంగా ఇబ్బందిపడ్డాగానీ శాశ్వాతంగా నల్లధనం రూపులేకుండా, అందరికి అభివృద్ధి ఫలాలు అందుతాయి అని సామాన్యులు కూడా భావిస్తున్నారు. అందుకే ఎన్ని గంటలైనా కానీ ఎంతో ఓపికతో ఎదురుచూస్తున్నారు.

మొత్తం ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

pakistani-media-inappropriate-stories-on-india

అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది

భారత్ పాకిస్థాన్‌ల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ కు చెందిన దాదాపుగా 19 మంది జవాన్లను పాక్ ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చారు. యావత్ ప్రపంచం దీనిపై దిగ్రాంభితిని వ్యక్తం చేసింది. పాక్ వైఖరిని తీవ్రంగా ఖండించింది. భారత్ లో అయితే ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మీడియాలో భారత్- పాక్ యుద్ధం తప్పదు అన్న రేంజ్ లో వార్తలు రాశాయి. అమరల వీరులకు నివాళి ఘటిస్తూ వార్తలు ప్రసారమయ్యాయి. భారత్ లో పరిస్థితి ఇలా ఉంటే పాకిస్థాన్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అక్కడి మీడియా చేస్తున్న అతిని చూస్తే ఎవరికైనా చిర్రెత్తుకువస్తుంది.

మొత్తం ఆర్టికల్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

bjp-using-surgical-strick-for-political-benefit

సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?

ఓ పక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో అధికార బిజెపి పార్టీ అసలే బలం లేని రాష్ట్రాల్లో ఎలా పట్టుసాధించాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడింది. చివరకు నరేంద్ర మోదీని హైలెట్ చేస్తూ.. వచ్చిన ఓ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది. అయితే దీనిపై బిజెపి వర్గాల్లో నెలకొన్న భయాన్ని మోదీ ఎలా అధిగమించాలా.? అని తీవ్రంగా ఆలోచించి చివరకు రామబాణంలాంటి ఓ ఉపాయాన్ని కనుగొన్నారు. అదేమిటంటే.. ప్రస్తుతం బిజెపికి బాగా కలిసివస్తున్న సర్జికల్ స్ట్రైక్ ను ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.

మొత్తం ఆర్టికల్ ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Modi facing problems like mother pain during

‘నవభారత్’ను కనేందుకు భరతమాత సిద్ధం.. పురుటి నొప్పులు మాత్రం ప్రధానికే

దేశం మొత్తం బాధను అనుభవిస్తోంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం దేశంలో చాలా మందికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నోళ్లకు ఫుల్ గిరాకీ తగిలింది. కొంత మంది అయితే కారుకూతలు కూస్తున్నారు. అయితే ఇక్కడ ఓ సూక్ష్మాన్ని మాత్రం చాలా మంది గుర్తించడంలేదు. మంచి చెయ్యాలి అంటే కొంత ఇబ్బందిపడక తప్పదు అని. మోదీ కూడా గోవా సభలో అదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 30 వరకు అందరికి ఇబ్బందులు తప్పవని, కానీ భావితరాల భవిష్యత్తు కోసం తప్పదు అని అన్నారు.

నిజానికి భారతదేశం పరిస్థితి అచ్చంగా పోల్చాలి అంటే ఓ తల్లి ప్రసవ వేదనతో పోల్చవచ్చు. నవభారతం కోసం మనం ఎదురుచూస్తూనే ఉన్నాం.. కానీ అలాంటి భారతదేశం రావాలి అని అనుకుంటున్నామే కానీ మన కళ్ల ముందు సాక్షాత్కారానికి సిద్దంగా ఉన్న ఆ పరిస్థితిని మాత్రం గుర్తించడంలేదు. నవభారతం ఇప్పుడు పొత్తిళ్లలో ఉంది. కానీ ప్రసవ వేదన మాత్రం కేవలం ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కలుగుతోంది. అవును చరిత్ర కూడా ఇదే చెబుతోంది. నవభారతం కోసం తీసుకున్న ప్రతీసారి ప్రధానులు అనేక ఇబ్బందులు, అవమానాలుపడ్డారు.

నాడు భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఇందిరాగాంధీ నుండి నేటి నరేంద్ర మోదీ వరకు అవే అవమానాలు. అవే అనుమానాలు. కానీ నాయకుడు దేశానికి ప్రధాని అయితే ఇలాంటి వాటికి భయపడి వెనకడుగువేయడు. నాడు బ్యాంకులను జాతీయం చేసినప్పుడు కూడా ఇందిరా గాంధీ అనేక విమర్శలను ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీకి పిచ్చిపట్టింది.. అసలు ఆమె ఏం చేస్తుందో కూడా అర్థంకాని పరిస్థితిలో ఉంది అని చాలా మంది అన్నారు. కానీ నిజానికి నేడు మనం బ్యాంకింగ్ లో ఇన్ని సేవలు అందుకుంటున్నాం.. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉంది అంటే అది ఇందిరాగాంధీ చలవే. నాడు అవమానాలకు ఆమె భయపడి వెనక్కి తగ్గి ఉంటే నేడు మనం ఈ ప్రగతిని చూసి ఉండేవాళ్లం కాదు.

అంతంత మాత్రం మెజార్టీతో ప్రభుత్వాన్ని గుడ్డిలో మెల్లలా నడిపించిన నాటి మరో ప్రధాని పి.వి. నరసింహారావు తీసుకున్న పారిశ్రామిక విధానాలు దేశ ఆర్థిక ప్రగతిని మార్చివేశాయి. నాడు ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలకు పివి తెర తీశారు. భారత ఆర్థిక వ్యవస్థను 1991కి ముందు, 1991 తర్వాత అని రెండు భాగాలుగా చేసింది పివినే. నేడు భారత్ ఆర్థికంగా బలంగా ఉంది అంటే అది ఖచ్చితంగా పివి నిర్ణయమే. నాడు పివిని సొంత పార్టీ నాయకులే విమర్శించారు. ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని పదవిలో పివి ఫీట్లు చేస్తున్నారు అని నాడు ఎంతో మంది విమర్శించారు. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు.

తరాలు మారాయి.. దేశంలో స్థితి, దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మారింది అయినా కానీ సంస్కరణలు చెయ్యాలనుకున్న ప్రధానికి తిప్పలు మాత్రం తప్పడం లేదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం నాడు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఎన్ని ఇబ్బందులుపడ్డారో.. నేడు మోదీ అంతకు మించిన తిప్పలుపడుతున్నారు. నల్లధనం మీద తాను పోరాటం చేస్తానని, భారతదేశానికి చెందిన సొమ్ము ఎక్కడ ఉన్నా కానీ వదిలిపెట్టేది లేదు అని మోదీ స్పష్టం చేశారు. నల్లధనం మీద పోరాటంలో భాగంగా ప్రస్తుతం పాత పెద్ద నోట్లను రద్దుచేసిన మోదీ, భరతమాత నవభారతకు జీవం పొయ్యడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ ప్రతీసారి ప్రధానిగా ఉన్న వారికి మాత్రం పురుటినొప్పులు పడకతప్పడం లేదు. పురుటి నొప్పులకు బాదపడి తల్లి బిడ్డను ఏ తల్లీకనడం మానదు. అలాగే మోదీ కూడా ఇప్పుడు భయపడటం లేదు. మోదీ కేవలం 50 రోజులు మాత్రమే అడుగుతున్నాడు. తరతరాలుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత క్షణాలు కనీసం మోదీ పుణ్యాన అయినా కనిపిస్తాయేమో చూడాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ, దేశం పరిస్థితి అచ్చం త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ లాగా ఉంది. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.

Modi

ఆ లైన్ తీసేయగల ప్రధాని ఒక్క నరేంద్ర మోదీనే

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే లైన్ ను మా తాతలు చదివారు, మా నాన్నలు చదివారు, ఇప్పుడు మేం చదువుతున్నాం, రేపు మా పిల్లలు కూడా చదువుతారు. అయినా అభివృద్ధి చెందడానికి అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు అవసరమా అనే ఫ్రశ్న మనలో చాలా మందిలో ఉంటుంది. ఎన్నికలకు ముందు ప్రతి నాయకుడు వచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం అని తొడగొడతారు. కానీ పుష్కరకాలం గతించినా కానీ మార్పు రాదు. కానీ మోడువోయిన చెట్టులో చిగుర్లు తొడుగుతున్న అనుభూతి కలుగుతోంది. అప్పుడెప్పటి నుండో మనం వింటున్న అభివృద్ధిని మన కళ్ల ముందు చూపించడానికి ఓ మార్గం దొరికింది.

నిన్న రాత్రి కాస్త లేట్ గా అయినా ఓ స్పీచ్ విన్నా. ఆ స్పీచ్ వినేటైంలో చేతి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. చెవులు రింగులుమోగాయి. పెదవుల మీద చిరుదరహాసం.. కళ్లలో ఆనందం. ఇంతలా ప్రభావితం చేస్తున్న స్పీచ్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారా..? భారత ప్రధాని నరేంద్ర మోదీ. అవును.. గోవాలో, ఘజియాపూర్ లో మోదీ మాటలు విన్నాక, అభివృద్ధి అనే మాటకు, న్యాయం జరుగుతుంది అనిపిస్తోంది.

మోదీ మాట్లాడుతూ కేవలం యాభై రోజులు నాకు గడువివ్వండి.. దేశాన్ని మార్చి చూపిస్తా అని అన్నాడు. కానీ కొంత మంది రాజకీయ వేషగాళ్లు మోదీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. తుమ్మినా కానీ మోదీయే కారణం అని కారుకూతలు కూసే కేజ్రీవాల్, మమతా బెనర్జీలు దొరికిందే అవకాశంగా విరుచుకుపడ్డారు. దేశం మొత్తం మోదీకి అండగా నిలుస్తోంది. నిజానికి బస్సు ఛార్జీలు కాస్త పెంచితేనే గగ్గోలు పెట్టి, నానారాద్దాంతం చేసే జనం సైలెంట్ గా డబ్బుల కోసం క్యులైన్లలో నిల్చున్నారు అంటే ఖచ్చితంగా వారంతా మోదీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు అని అర్థం.

కాంగ్రెస్ చవటలు ఇన్ని సంవత్సరాలుగా చెయ్యలేని పనిని, మోదీ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు చూడండి అని గాంధీ ట్యాగ్ లైన్ తో ఇప్పటికీ నెట్టుకువస్తున్న వారు కూడా మోదీని ప్రశ్నిస్తుండటం నిజంగా సిగ్గుచేటు. ఆడా, మగా, ముసలి, ముతక అందరూ కూడా మోదీ నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నా కానీ నల్లడబ్బు బయటకు వస్తుంది.. మనకు మంచి రోజులు వస్తాయన్న గట్టి నమ్మకంతో మోదీకి అండగా నిలుస్తున్నారు. కానీ తాము చెయ్యలేని పనిని మోదీ చేస్తే మాత్రం తట్టుకోలేక.. కొన్ని విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయి. అయినా మోదీలాంటి ఏనుగు రోడ్డు మీద వెళుతుంటే అలాంటి కుక్కలు మొరగడం ఖాయం.

నాడు పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ మోదీ తీసుకువచ్చిన నల్లధనం పాలసీపై వెటకారంగా మాట్లాడారు. మోదీగారు ఫెయిర్ అండ్ లవ్లీ యోజనను తీసుకువచ్చారు. దాని ప్రకారం ఏంటంటే.. మీ నల్లడబ్బును ట్యాక్స్ కట్టడం ద్వారా తెల్లగా మార్చుకోవచ్చు అని వెటకారంగా మాట్లాడారు. కానీ అదే రాహుల్ గాంధీ అండ్ కోకు మోదీ తీసుకున్న నిర్ణయం కనీసం నిద్ర కూడా లేకుండా చేసి ఉంటుంది. రాజకీయ పరిణతిలేని రాహుల్ గాంధీ కూడా నాలుగు వేల కోసం క్యు లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. అయినా మోదీ చేసేది ముమ్మాటికి కరెక్ట్ అని దేశం మొత్తం అంటుంటే.. కొంత మంది మాత్రం తప్పు అనడం ఏంటో.

Modi perfect answer with surgical stike

నరేంద్ర మోదీ.. ఓ మగాడు, మొగుడు

భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అడుగు వేశాడు. భారత రక్షణ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించే ఓ అధ్యాయానికి అంకురార్పణ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు తమ డైరీల్లో రక్తాక్షరాలను లిఖించుకునేలా భారత ఆర్మీని ఎంతో నేర్పుగా వాడారు మోదీ. యుపిఎ సర్కార్ కంటే ఎన్డీయే సర్కార్ ఉంటే ఖచ్చితంగా దేశరక్షణ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు అనే నమ్మకానికి మరోసారి నిదర్శనాన్ని చూపారు. మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్ కు ప్రేమ లేఖలు కాదు.. బుల్లెట్లు పంపుతారు అని ఎంతొ మంది నమ్మిన నమ్మకాన్ని రుజువు చేశారు.

పాకిస్థాన్ ఆక్రమిక కాశ్మీర్ లోకి భారత్ ఆర్మీ చొచ్చుకువెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్ అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. మోదీ సహనాన్ని అలసత్వంగా తీసుకున్న పాకిస్థాన్ పదేపదే తన ఉగ్రపంజా విసిరింది. భారత ఆర్మీ బలం ఏంటో.. మోదీ స్ట్రాటజీ ఏంటో కేవలం ఒకే ఒక్క దాడితో నిరూపించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియ్యడమే కాకుండా.. భారత ఆర్మీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు మోదీ.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ ఏం చెయ్యలేకపోతున్నారు.. నాడు చూపించిన 56 ఇంచుల ఛాతి ఎక్కడికి పోయింది అన్న విమర్శకులకు ఒకే ఒక్క ఘటనతో నిరూపించారు. ఆలస్యంగా అయినా కాస్త ఆలోచనతో వేసిన మోదీ అడుగు పాకిస్థాన్ ఉగ్రవాదులకు, అక్కడి సేనలకు ప్యాంటు తడిసేలా చేసింది. మన ఆర్మీ బేస్ మీద దొంగచాటుగా పాక్ ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా.. వారి భూభాగంలోనే 39 ఉగ్రవాదులను హతమార్చి.. మోదీ దైర్యం ఏంటో నిరూపించారు.

లాల్ బహదూర్, వాజ్ పేయి చెయ్యలేనిది మోదీ చేసి..
చరిత్రలో పాకిస్థాన్ మీద ఇలాంటి దాడులకు పాల్పడిన మొదటి ఘటన కూడా ఇదే. నాడు లాల్ బహదూర్ శాస్త్రి దగ్గరి నుండి వాజ్ పేయ్ వరకు మన ప్రధానులు పాకిస్థాన్ కు శాంతి కపోతాన్ని పంపితే వాళ్లు మాత్రం దాన్ని చంపేస్తున్నారు. పార్లమెంట్ మీద దాడి ఘటన తర్వాత కూడా వాజ్ పేయి గట్టిగా పాకిస్థాన్ కు బదులివ్వలేదు అని ఇప్పటికీ విమర్శ. కానీ లాల్ బహదూర్ శాస్త్రి, మోదీ చెయ్యలేని సహసాన్ని మోదీ చేసి.. పాకిస్థాన్ కు ధీటైన సమాధానమిచ్చారు.

మగాడు అంటే ఎలా ఉంటాడో నిరూపించాడు మోదీ. పాకిస్థాన్ ముష్కర సేన మన ఆర్మీ క్యాంపుల మీద దాడి చేస్తే.. పాకిస్థాన్ ప్రధాని కడుపు మండిన కాశ్మీరీలు ఇలా చేసి ఉంటారు అని చతురత ప్రదర్శించారు. మన మోదీ మాత్రం తన దైర్యాన్ని చూపించారు. పాకిస్థాన్ కలలో కూడా ఊహించని విధంగా వారి భూభాగంలోనే పాకిస్థాన్ ఉగ్రవాదులను హతమార్చేసింది మన ఆర్మీ.

ఉరీ ఘటన తర్వాత పాకిస్థాన్ భారత్ మీద కాదు.. పేదరికం మీద పోరాటం చెయ్యాలి అన్న ప్రకటన చాలా మందిలో నిరుత్సాహం నింపింది. ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దాడి చేస్తే తాట తీస్తాం అన్న మోదీ ఇలా మాట్లాడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అలా అని తన రాజనీతిని నిరూపించాడు. ముందుగా పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజంలో తలదించుకునేలా చేసి.. సార్క్ సమావేశాల్లో ఏకాకిని చేసి.. అప్పుడు దెబ్బ తీశాడు. పాకిస్థాన్ కు సరైన మొగుడు నరేంద్ర మోదీనే అనేలా చేశాడు.

పాకిస్థాన్ నుండి ఇప్పటి దాకా ఎన్నో సార్లు దాడులు జరిగాయి. మన వాళ్లు ఎంతో మంది చనిపోయారు. పాకిస్థాన్ కు ఎన్నో సార్లు మన వాళ్లు హెచ్చరికలు జారీ చేశారు. కానీ కుక్క బుద్దిలాగా తన వైఖరి మార్చుకోలేదు. అందుకే మోదీ ఒకే ఒక్క దాడి చేయించారు. అంతే నిన్నటి దాకా ఉన్న చరిత్ర మొత్తం తుడుచుకుపోయింది. పాకిస్థాన్ కు భారత్ ఇలా కూడా చెయ్యగలదు అని నిరూపించాడు. పాకిస్థాన్ లోకి దూరి చంపే సీన్లు కేవలం సినిమాల్లో మాత్రం చూపించడం జరుగుతుంది.. కానీ రియల్ లైఫ్ లో అది చేతకాదు అన్న వారికి సర్జికల్ స్ట్రైక్ ఒక గుణపాఠం అవుతుంది. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన మోదీ నిజంగా పాకిస్థాన్ కు తగ్గ మగాడు, మొగుడు