కేసీఆర్ అందరి వాడు మరి కేటీఆర్ కొందరి వాడా?

ktr

తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడంతోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తన అద్భుతమైన పరిపాలనతో కేసీఆర్ అందరి మన్ననలు పొందుతున్నారు. కేసీఆర్ తర్వాత ఎవరూ అనే ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ పేరు సర్వత్రా వినిపిస్తోంది. కానీ గతకొంత కాలంగా కేటీఆర్ పోకడ చూస్తుంటే ఎక్కడో కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్‌కు అన్ని వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరి అలాంటి క్రేజ్ కేటీఆర్‌కూ ఉందా అనే దానిపై కాస్త ఆలోచించి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఫోకస్ మొత్తం హైదరాబాద్ మీదే ఉండిపోయింది.

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో గెలవడం వేరు… ఒక్క హైదరాబాద్‌లో గెలవడం వేరు అనే మాటలకు సమాధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా గులాబీ జెండా రెపరెపలాడింది. అయితే ఆ ఎన్నికల బాధ్యతను మొత్తం భుజాలపై వేసుకున్న కేటీఆర్ ఒక్కసారిగా ఫాంలోకి వచ్చారు. అంతే ఆ ఎన్నికల ఫలితాల నుండి కేటీఆర్ ఒక పరిధిలో మాత్రమే ఉంటున్నారు అనేది నిజం. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ వార్తల్లోకి రావడం, హైదరాబాద్ మీద కాన్ఫిరెన్సులు, జీహెచ్ఎంసీ పరిధిలో ఏదో ఒక శంఖుస్థాపనకు వెళ్లడం, తెలుగు సినీ ప్రముఖులతో ములాఖత్ లాంటి వాటితో బిజీగా మారిపోయారు.

తెలంగాణలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులు ఏ పొజీషన్‌లో ఉన్నా కూడా మాస్ ఫాలోయింగ్‌ను మాత్రం ఎక్కడా కోల్పోలేదు. కానీ కేటీఆర్ మాత్రం ఈ పాయింట్‌ను మిస్ అయ్యారనిపిస్తోంది. అసలు మాస్ ఫాలోయింగ్ ఎందుకు అవసరం? అని ఎవరికైనా అనుమానం కలుగుతుందేమో… మాస్ జనాలు ఒక్కసారి ప్రేమించడం, ఆరాధించడం మొదలుపెడితే చచ్చేదాకా వారి మైండ్ సెట్ మారదు. కానీ సిటీ జనాలు అలా కాదు.. ఏ గాలికాగొడుగు పట్టేస్తారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కేటీఆర్ కూడా తన తండ్రిలాగా ‘అందరివాడు’ అవ్వాలంటే కొన్ని విషయాల మీద దృష్టిసారించాల్సిందే.

Advertisements
AP Cm Chandrababu naidu facing problems with his self mistakes

ప్రెస్ మీట్ల చంద్రం ‘తొందర’.. అంతటా నవ్వుల పాలు

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని ముఖ్యమంత్రిగా, అభివృద్ధికి అందెలద్దిన సిఎంగా గుర్తింపు ఉన్నా ఇప్పుడు మాత్రం నవ్వుపాలవుతున్నారు. తత్వం బోధపడక చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి చివరకు మీడియాలో ఆయనను నవ్వుపాలుచేస్తోంది. రెండు టర్ములు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ ఏ అంశం మీద ఎలా స్పందిచాలో తెలియక జనాలకు లేని చర్చకు తావిస్తున్నారు.

మొత్తం ఆర్టికల్ ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

there-is-no-chance-to-chandrababu-in-ap-and-kcr-will-be-lagend-in-telangana/

బాబుకు అవకాశం లేదు… కేసీఆర్ కు తిరుగులేదు

విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓ రాష్ట్రం వెలుగు విరజిమ్ముతుంటే.. మరో రాష్ట్రం మాత్రం చీకట్లో జారుకుంది. తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా కొనసాగుతుండగా, ఏపి మాత్రం లోటుతో నడుస్తోంది. ఇక సిఎంల విషయానికి వస్తే మాత్రం ఏపిలో నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల టైంలో ఉన్న మెజారిటీలో పావు వంతు కూడా వచ్చే ఎన్నికల్లో రాదు అని చాలా సర్వేలు తేల్చాయి. తెలుగుదేశం పార్టీకి రానురాను మైలేజ్ తగ్గుతుండటంతో చంద్రబాబు నాయుడు సర్కార్ లో భయం పట్టుకుంది. ఏపిలో ప్రభుత్వం మీద ఉన్న అసమ్మతి ఎలా ఉంది అనే దానిపై చంద్రబాబు నాయుడు పలు దర్యాప్తు సంస్థల నుండి, ధర్డ్ పార్టీ సర్వేల్లో కూడా బాబు సర్కార్ కు ఈసారి షాక్ తగనుట్లు వెల్లడైంది.

ఈ ఆర్టికల్ ఒరిజినల్ కాపీని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

/need-to-give-reservations-for-poor-people

రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి… కేసీఆర్ సర్కార్‌కు సూచన

కేసీఆర్ మ‌రోసారి తేనెతుట్టును క‌దిపారా.. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తుంది. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంలో ముందుండే కేసీఆర్, రిజ‌ర్వేష‌న్లు వ్య‌వ‌హారంలో కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌నుకుంటున్నారా? కానీ అది కొన్ని వ‌ర్గాల‌కు సంతృప్తినిచ్చినా.. మిగిలిన వ‌ర్గాలను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇప్ప‌టికే రాజ్యాంగం క‌ల్పించిన కోటాలు దాటుతున్నాయి. మైనార్టీల‌కు హామీ ఇచ్చారు. గిరిజ‌నుల‌కు పెంచుతామ‌న్నారు. ఇప్పుడు బీసీల‌కు కూడా దామాషా ప‌ద్ద‌తిలో క‌ట్ట‌బ‌డి ఉన్నామంటున్నారు.

ఈ ా ఆర్టికల్ ఒరిజినల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపికి ప్రత్యేక హోదా రావాలంటే కేసీఆర్ సలహా ఇదే..

KCR suggetion to get special status for andhrapradesh

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి దీక్షాదక్షుడో అందరికి తెలుసు.. సింపుల్ గా చెప్పాలంటే తను అనుకున్నది సాదించే వరకు వెనక్కి తగ్గని మోనార్క్ అని. ఎన్నో దశాబ్దాల తెలంగాణ రాష్ట్రాన్నిసాధించి పెట్టింది కూడా ఆ మొండి తనమే. ఓ పక్క రాజకీయంగా ప్రత్యర్థులకు చెక్ చెబుతూనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అయితే రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు చాలా మారిపోయాయి. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉండగా.. ఏపి మాత్రం లోటు బడ్జెట్ ను కలిగి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపికి అన్ని విధాల న్యాయం చేస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పింది కానీ లిఖితపూర్వకంగా ఎక్కడా రాసి ఇవ్వలేదు. దాంతో యుపిఎ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కూడా ఏపి ప్రజల జీవితాలతో చలగాటమాడుతోంది.

ఇలా మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆటలను కట్టించి.. ఏపికి ఎలా ప్రత్యేక హోదా సాధించుకోవాలో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎంతో వివరంగా వివరించారు. నిజంగా వీటిని గనక ఏపి ప్రజలు ఫాలోయితే మాత్రం కేంద్రం దిగివచ్చి.. స్పెషల్ స్టేటస్ ను ఆగమేఘాల మీద ప్రకటించడం ఖాయం. ఇంతకీ కేసీఆర్ ఏం చెప్పాడు.. ఏం చెయ్యాలి అని అప్పుడే అనుకుంటున్నారా..?

* అన్నింటికన్నా ముందు అప్పుడెప్పుడో వేమన చెప్పినట్లు.. ఓ పనిని ప్రారంభించి వదిలేసేటట్లు ఉంటే అసలు దాన్ని ప్రారంభించకపోవడమే మంచిది. కాబట్టి ఖచ్చితంగా సాధిస్తాం అనే నమ్మకంతో ప్రారంభించండి.
*ఇక ఉద్యమాన్ని ఉప్పెనలా తీసుకెళ్లాలంటే అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో.. భావి తరాల వారికి దాని వల్ల కలిగే లాభాలను, ఇప్పటికిప్పుడు ఏపికి వచ్చే లాభాలను ప్రజలకు వివరించాలి.
* ఉద్యమంలో ఖచ్చితంగా మాటల తూటాలు, సాహిత్యం కీలకదశకు చేరుస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అంత ఉృతంగా తీసుకెళ్లడానికి వేల మంది కళాకారులు కృషి చేశారు.
* అన్నింటికి మించి విద్యార్థి శక్తి ముందు ఏ శక్తీ తాళలేదు కాబట్టి యూనివర్సిటీలను ఉద్యమానికి కేంద్ర బిందువులు మారిస్తే మంచింది.
* ఉద్యమం సెగ దిల్లీకి తగలాలి అంటే అక్కడ ఉన్న ఎంపీలు కేంద్రానికి అల్టిమేటం జారీ చెయ్యాలి.. నెల రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకోవాలని లేదంటే రాజీనామా చేస్తామని వెల్లడించాలి. ఒకవేళ ఎంపీలు అలా చెయ్యకపోతే ఏపిలో పరిస్థితులు అలాంటి కష్టమైన పరిస్థితులను కల్పించాలి.
* ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా జేఏసీ ఏర్పడాలి.
* గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో ఎలా అయితే ఏపి మొత్తం ఏకమైందో అలాగే ఇప్పుడు కూడా ఏకంగా కావాల్సిన ఆవశ్యకత ఏర్పడాలి.
*ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాలి…. కేంద్రం నుండి ప్రత్యేక హోదా అనే ప్రకటన తప్ప వేరే దేని గురించి పట్టించుకోరాదు.
* కేంద్రం నిధులు ఇస్తామని ముందు నుండి అంటోంది.. కానీ రెండు సంవత్సరాల్లో ఇచ్చింది లేదు. కాబట్టి ప్రత్యేక నిధిని ఇస్తాం అంటే కేవలం ప్రత్యేక హోదా మాత్రమే కావాలని పట్టుబట్టాలి.
*ఇక ఉద్యమ సెగ దిల్లీకి తాకాలంటే ఏపిలో పరిస్థితులు మారాలి.. ప్రజావ్యవస్థను మొత్తం స్తంభించాలి. అందుకు ప్రజలనను ముందే సిద్దం చెయ్యాలి.. అది ఐదు రోజులుకావచ్చు.. యాభై రోజులు కావచ్చు కానీ దానికి సిద్దంగా ఉండాలి.

అయితే ఇది ఒక్క రోజుతో ముగిసిపోయే పోరాటం కాదు కాబట్టి అన్నింటికి మించిన ఆత్మవిశ్వసం, ఓపికి ఉండాలి. రెచ్చగొట్టే వాళ్లు ఉంటారు.. నీరుగార్చే వాళ్లుంటారు. అయినా కానీ ముందుకు సాగాలి. వచ్చిన వారిని కలుపుకొని పోవాలి.. కలిసిరాని వారిని తమలో ఎలా కలుపుకుపోవాలో ఆలోచించాలి. అన్నింటికి మించి నాయకులు ఎవరూ కూడా కొంత మందికి వంతపాడే వైఖరిని అవలంభించరాదు. ఔర్ ఏక్ దక్కా.. తెలంగాణ పక్కా అన్న నినాదంలా.. ఒకే ఒక్క షాక్ తో కేంద్రం కిందికి దిగివస్తుంది. గతంలో నందమూరి తారకరామారావు ఇచ్చినట్లు దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చెయ్యాలి. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని అన్నట్లే.. ఏపికి ప్రత్యేక హోదా లేదంటే బలిదానాలకు, బలితీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలి.

తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!

Modi-to-telugu-States

భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో, దేశంలో చాలా చోట్ల ఆయనకు బ్రహ్మరథం పట్టవచ్చు కానీ ఆయన మాత్రం తెలుగు వారిని వెర్రి వెంగళప్పలను చేస్తున్నారు. అదేంటి మోదీ అందరి అభివృద్ది కోసమే కదా పని చేస్తున్నారు అని అనుకుంటున్నారా..? కానీ తెలుగు వారి విషయానికి వస్తే ఇక్కడ కండీషన్స్ అప్లై అన్నట్లుంది వ్యవహారం. తెలుగు వారి గురించి ఎన్నికల టైంలో చేసిన ప్రకటనలు, మాట్లాడిన మాటలు వింటే ముక్కున వేలేసుకుంటారు. మరి ఇప్పుడు అదే తెలుగు వాళ్లకు ఆయన చేసిందేముంది అనే దానికి సమాధానం వెతికే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే సమాధానం దొరకడం కొంచెం కష్టంకాబట్టి.

తెలుగు వాళ్లు మా గుజరాత్… మా సూరత్ లో ఉన్నారు. వాళ్లను ఎప్పుడూ మా ఇంటి వాళ్లలాగానే చూసుకుంటాం అంటూ మాట్లాడారు మోదీ. కానీ ఇప్పుడు తెలుగు వారి ఇళ్లు దారుణంగా మారాయి. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత సవాళ్ల మధ్యన పడవలేసుకు నడుస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన చేసిందేమీ లేదు. కేంద్రం నుండి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తాము ముందుండి.. అడగక ముందే చేస్తామని చెప్పిన మోదీ కనీసం ఎంగిలి చేయిని కూడా విదల్చడం లేదు.

ఏపిలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ద్రవ్యలోటు ఉంది. దాన్ని పూడ్చేందుకు కేంద్రం నిధుల సహాయం చెయ్యాలి. దిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు దానిపై మోదీకి లేఖలు అందిస్తారు.. సరే మోదీని కలిశారు కదా అని ఏదో ఫార్మాల్టికి వెయ్యకోట్లు విడుదల చేసి మేం సహాయం చేశాం… మీరు ఊహించనంత సహాయం చేస్తాం అంటూ ప్రకటిస్తారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడమే మానేశారు.. నిధుల గురించి మాట్లాడితే ఉలకరుపలకరు. మరి ఏపిలో ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బిజెపి నాయకులు, అందునా మోదీ ఇలానేనా చేసేది అంటే రాజకీయం అంటే ఇదేరా అన్నట్లు సమాదానాలు వస్తున్నాయి.

ఇక ముందు నుండి కూడా తెలంగాణలో టిఆర్ఎస్ తో సానుకూల వాతావరణం లేదు. దాంతో టిఆర్ఎస్ తో పొత్త చర్చలు కూడా జరగలేదు. దాంతో కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సహాయం చెయ్యడం లేదు. తెలంగాణ స్వతహాగా పైకి ఎదుగుతున్న రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అంటూ సవాలక్ష కారణాలు చూపిస్తూ.. చివరకు చేతికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నారు. మొత్తానికి మోదీ తెలంగాణ, ఏపిలలో తెలుగు వాళ్లను వెర్రివెంగళప్పలను చేసి.. కాలం వెల్లదీస్తున్నారు. మరి దీనిపై తెలుగు వాళ్లు ఎన్నికల్లో ఎలా సమాధానమిస్తారో చూడాలి.